Jammu kashmir: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మరో రెండు నెలల్లో జమ్మూకశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది. మరిన్ని రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. By srinivas 17 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి BJP Kishan Reddy: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసిన కొద్దిరోజుల్లోనే బీజేపీ (BJP) అధిష్టానం పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆయా రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమించింది. 2024 చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఇక్కడ సత్తాచాటేందుకు బీజేపీ కేంద్ర అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జిలను (Election Incharges) నియమిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇది కూడా చదవండి: నా కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది.. పోలవరంపై చంద్రబాబు – Watch Live మహారాష్ట్రకు ఇద్దరు కేంద్ర మంత్రులు.. ఈ మేరకు జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు (Jammu Kashmir Assembly Elections) కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం ఎన్నికల ఇంచార్జిగా నియమించింది. అలాగే మహారాష్ట్రకు ఇద్దరు కేంద్ర మంత్రులను ఇంచార్జిలుగా నియమించారు. పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను ఇంఛార్జిగా నియమించగా.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కో- ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే కేంద్ర మంత్రి దర్మేద్ర ప్రదాన్ కు హర్యానా రాష్ట్ర ఇంచార్జి బాధ్యతలు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ సహాయ బాధ్యతలు అప్పగించారు. ఝార్ఖండ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు బాధ్యతలు ఇచ్చారు. అతనికి అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మను సహాయకారిగా నియమించారు. #bjp #kishan-reddy #jammu-and-kashmir #assembly-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి