Khiladi Lady: కిలాడీ లేడీ సయీదాను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ డబ్బులు గుంజుతున్న కిలాడీ లేడీని జూబ్లీహిల్స్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయి.

New Update
Khiladi Lady: కిలాడీ లేడీ సయీదాను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

Arrest:హైదరాబాద్‌లో అన్ని రోడ్లు అన్నీ ఈ కిలాడీ లేడీవే. రోడ్డు మీద నిల్చోడం...దారిన పోయే కార్ల వారిని లిఫ్ట్ అడగడం సయీదా నయీమా సుల్తానా చేసే పని. అయితే కార్ ఎక్కిన తర్వాతనే అరాచకం అంతా మొదలవుతుంది. ఒకసారి కారులో కూర్చున్నాక ఈమె వేసే వేషాలు అన్నీ ఇన్నీ కావు. సయీదా బారిన పడి పాపం చాలా మంది మగవాళ్ళు బలైపోయారు. కారు ఎక్కిన తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసేది. ఎందుకు ఇవ్వాలని అడిగితే బట్టలు చింపుకుని నన్ను రేప్ చేశావంటూ బెదిరించేది. తాను లయర్ని అని...తనకు అన్ని సెక్షన్లు తెలుసునంటూ దబాయించేది. టకటకా సెక్షన్లను కూడా వల్లించేది. పాపం దీనికి భయపడి చాలా మంది ఈ కిలాడీ లేడికి డబ్బులు కూడా సమర్పించుకున్నారు. తర్వాత కంప్లైంట్ ఇచ్చినా చాలా రోజులు దొరక్కుండా తప్పించుకుంది. చివరకు ఈరోజు జూబ్లీ హిల్స్‌లో ఈమెను పట్టుకున్నారు పోలీసులు.

Also read:ఒక్కరోజులోనే 602 కొత్త కరోనా కేసులు నమోదు

సయీదా చాలా తెలివైనది కూడా. మామూలుగా దబాయిస్తే నమ్మరని...పక్కాగా లా సెక్షన్లను అన్నీ కంఠతా పెట్టేసింది. ఈమె వద్ద వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు ఉన్నాయి. వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితులను బెదిరిస్తూ ఇన్నాళ్ళు పబ్బం గడుపుకుంది. అయితే ఈరోజు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఓ కారులో ఎక్కింది సయీదా. బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసింది. అయితే కారు డ్రైవర్ పరమానంద ఏ మాత్రం భయపడకుండా ఆమెను నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి అప్పగించాడు. దాంతో ఆమెగారి ఆటలు కట్టయ్యాయి. ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు కిలాడీ సయీదా నయీమా సుల్తానాను అరెస్ట్ చేశారు. సయీదా వయసు 32 ఏళ్ళు. ఈమె మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయి. అంతేకాదు పలువురు అమాయకుల మీద కిలాడీ లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడి అయింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jethwani case: జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్.. IPS ఆఫీసర్ అరెస్ట్!

ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు అతన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేశారు.

New Update
jatwani

AP IPS officer Anjaneyulu arrest

Jethwani case: ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు అతన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేశారు.

updating..

 

actress-jatwani | mumbai | ips | arrest | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment