TG: ఖమ్మం-హైదరాబాద్ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. మంత్రుల కీలక ప్రకటన!

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు NHAI గుడ్ న్యూస్ చెప్పింది. ఖమ్మం-సూర్యాపేట రోడ్డు హైదరాబాద్-విజయవాడ హైవేను కలిసే ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీంతో ఖమ్మం నుంచి వచ్చే వాహనదారులు యూటర్న్ కోసం 2 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.

New Update
TG: ఖమ్మం-హైదరాబాద్ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. మంత్రుల కీలక ప్రకటన!

Khammam - Hyderabad Fly Over: కొన్ని రోజులుగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి అంటేనే వాహనదారులు భయపడుతున్నారు. నిత్యం అనేక యాక్సిడెంట్లు ఈ రోడ్డుపై జరుగుతుండమే ఇందుకు కారణం. పలు చోట్ల సర్వీస్ రోడ్లు లేకపోవడం, అవసరమైన చోట ఫ్లై ఓవర్లు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. 17 బ్లాక్‌ స్పాట్లలో అండర్‌పాస్‌లు, సర్వీసు రోడ్ల నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించింది. ఈ రోడ్డుపై మరో ఫ్లై ఓవర్ నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఓకే చెప్పింది.
ఇది కూడా చదవండి:  రేపే జాబ్ క్యాలెండర్.. కేబినెట్ కీలక నిర్ణయం

ఖమ్మం-సూర్యాపేట హైవే హైదరాబాద్-విజయవాడ హైవేను కలిసే ప్రాంతంలో ఫ్లై ఓవర్ లేదు. దీంతో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వారు ఈ హైవేపైకి వచ్చిన తర్వాత దాదాపు 2 కి.మీ మేర విజయవాడ వైపు ప్రయాణించి.. అనంతరం యూ-టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులకు దూరం పెరగడంతో పాటు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి:  వెంటనే వర్గీకరణ అమల్లోకి.. ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ మార్చాలన్న మందకృష్ణ!

దీంతో ఈ సమస్యను వివరిస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి NHAIకి లేఖ రాశారు. దీంతో స్పందించిన NHAI ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ ను మంజూరు చేసింది. మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో యాక్సిడెంట్లు ఆగుతాయన్నారు. సాధ్యమైనంత త్వరగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను వారు కోరారు.


Advertisment
Advertisment
తాజా కథనాలు