Kamala Harris: దూసుకుపోతున్న కమలా హారిస్.. ట్రంప్ కన్నా నాలుగు పాయింట్ల ఆధిక్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా స్వింగ్ స్టేట్స్‌లో ( పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్) పోల్ సర్వే చేపట్టాయి. అయితే ఈ సర్వేలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కన్నా.. కమలా హారిస్ నాలుగు పాయింట్ల ఆధిక్యంతో ఉన్నట్లు తేలింది. By B Aravind 11 Aug 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారోనని ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోని అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్ సర్వేల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా స్వింగ్ స్టేట్స్‌లో ( పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్) పోల్ సర్వే చేపట్టాయి. అయితే ఈ సర్వేలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కన్నా.. కమలా హారిస్ నాలుగు పాయింట్ల ఆధిక్యంతో ఉన్నట్లు తేలింది. Also Read: సెబీ ఛైర్‌పర్సన్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు : రాహుల్ ఈ నెల 5 నుంచి 9 వరకు ఈ మూడు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో 46 శాతం మద్దతు ట్రంప్‌కు రాగా.. కమలా హారిస్‌కు 50 శాతం మద్దతు వచ్చింది. డెమోక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడింట్ అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్‌వాల్జ్స్ ఎంపిక అనంతరం ఈ పోల్ నిర్వహించారు. ఇదిలాఉండగా ఇటీవల ఓ ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించిన పోల్ సర్వేలో కూడా ట్రంప్ కంటే కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆమెకు భారీగా విరాళాలు వచ్చాయి. మరోవైపు కమలాతో డిబేట్ సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటన చేశారు. సెప్టెంబర్ 10న ఈ డిబేట్ జరగనుంది. అధ్యక్ష ఎన్నికల ముందు జరిగే ఈ రెండో డిబేట్ చాలా కీలకమైనది. ఈ డిబేట్‌లో వాళ్లు మాట్లాడే విషయాల బట్టి ఓటర్ల ఆలోచనా విధానం కూడా మారుతుంది. అందుకే ఈ డిబేట్‌లో ఎవరు ఎలా మాట్లాడుతారో, ఏ అంశాలపై మాట్లాడుతారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also Read: నిర్మాణంలో కైగా పవర్ ప్లాంట్.. మేఘా కంపెనీ మరో విపత్తుకు దారి తీస్తుందా ? #telugu-news #donald-trump #usa-elections #kamala-haaris మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి