USA : రెఫ్యూజీలను అనుమతించడానికి ఇండియాకు భయం..జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు ఎప్పుడూ లేనిది అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వలదారులను అనుమతించడానికి ఇండియా భయపడుతుంది అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అందుకే భారత్‌లో అభివృద్ధి వేగంగా లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. By Manogna alamuru 03 May 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Joe Biden Controversial Comments : భారత్, చైనా(China), జపాన్(Japan), రష్యా(Russia) లు జెనోఫోబిక్ దేశాలంటూ విమర్శించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden). ఈదేశాలు రెఫ్యూజీలను అనుమతించవని అన్నారు. అందుకే భారత్ లాంటి దేశాలు వేగంగా అభివృద్ధి చెందడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. వాషింగ్టన్‌లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్ పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. దాంతో పాటూ అమెరికా గురించి కూడా గొప్పగా చెప్పుకున్నారు. అమెరికా..భారత్(America-India), మిగతా దేశాల్లాంటిది కాదని చెప్పారు. అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందన్నారు. అలా వచ్చిన వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తున్నారని...అందుకే తమ దేశం ఎప్పుడు అభివృద్ధి పథంలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. జోబైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.అందులోనూ ప్రస్తుతం భారత్‌లో ఎన్నికల టైమ్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా మిత్ర దేశాలైన భారత్, జపాన్ గురించి బైడెన్ తక్కువ చేసి మాట్లాడం ఏం బాలేదని విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు బారతీయుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. Breaking news: "President Joe Biden calls Japan and India ‘xenophobic’ nations that do not welcome immigrants." Joe Biden comes out as a hardline pro-immigrant, pro-open border & pro-Chinese fentanyl President of the US! pic.twitter.com/yyTTHrvSeZ — Tan Vu (@TanVu327031160) May 2, 2024 Also Read:Party Symbols: బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న కారు గుర్తును పోలిన సింబల్స్ #comments #usa #joe-biden #india #president మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి