JOBS: ఎన్‌ఎండీసీ, ఎన్‌హెచ్‌ఏఐలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు

న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 60 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్ లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 15 లాస్ట్ డేట్. హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 31 అప్లైకి చివరితేదీ.

New Update
JOBS: ఎన్‌ఎండీసీ, ఎన్‌హెచ్‌ఏఐలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు

NHAI Recruitment 2024: న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. తమ సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 60 డిప్యూటీ మేనేజర్‌ (టెక్నికల్‌) పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసివుండాలి.

వయసు:
30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక:
యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 ఫిబ్రవరి 15

వెబ్‌సైట్‌: https://nhai.gov.in/

Notification PDF

ఇది కూడా చదవండి : TSPSC: అదనపు పోస్టులతో ఫిబ్రవరిలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌?.. సిలబస్‌ ఇదే

హైదరాబాద్‌ ఎన్‌ఎండీసీ..
అలాగే హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ (NMDC) ఉద్యోగ ప్రకటన చేసింది. ఈ మేరకు సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలని కోరింది.

పోస్టుల వివరాలు
హెడ్‌- ఎన్‌ఎండీసీ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌: 01
ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 01
మానిటరింగ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ ఆఫీసర్‌: 01
ఆఫీస్‌ మేనేజర్‌: 01
డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్లు: 07
బ్లాక్‌ కోఆర్డినేటర్లు: 05

అర్హత:
సంబంధిత విభాగంలో సీఏ/ డిగ్రీ/ పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక:
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 జనవరి 31

అధికారిక వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/

Advertisment
Advertisment
తాజా కథనాలు