UNION BUDGET 2025: పదివేల మంది విద్యార్థులకు రీసెర్చ్ ఫెలోషిప్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

పదివేల మంది విద్యార్థులకు పీఎం రీసెర్చ్ ఫెలోషిప్‌ను ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో వెల్లడించారు. ఈ స్కీమ్ కింద ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్‌సీకి ఎంపికైనా వారికి ఫెలోషిప్‌ ఇవ్వనున్నారు. ఈ https://www.pmrf.in/ వెళ్లి అప్లై చేసుకోవాలి.

New Update
budget news

Pm Fellowship

కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకం ద్వారా 10,000 మందికి ఫెలోషిప్‌లను అందించనున్నట్లు వెల్లడించారు. ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోస్ (PMRF) స్కీమ్ కింద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISERs), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ఎంపికైనా విద్యార్థులకు ఫెలోషిప్‌ను ఇవ్వనుంది.

ఇది కూడా చూడండిCricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం

నెలకు రూ.70000 చొప్పున..

నెలకు రూ.70,000/- నుంచి రూ.80,000/- వరకు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదటి ఏడాదికి నెలకు రూ.70,000, మూడో ఏడాదికి నెలకు రూ.75,000, నాలుగో ఏడాది నెలకు రూ.80,000, ఐదో ఏడాది నెలకు రూ.80,000 ఇవ్వనుంది. దీంతో పాటు పరిశోధనల కోసం అర్హత సాధించిన వారికి సంవత్సరానికి 2 లక్షలు ఐదేళ్ల వరకు ఇవ్వనున్నారు. 

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

ఈ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అప్లై చేసుకోవాలంటే నాలుగు లేదా ఐదు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ M.Tech చివరి సంవత్సరం చదువుతున్నా లేకపోతే పూర్తి అయినా చేసి ఉండాలి. అలాగే రెండేళ్ల M.Sc చేయడంతో పాటు ఐఐఐటీల నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్‌లలో ఐదు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు చేసి ఉండాలి. అభ్యర్థులు కనీసం 8.0 సీజీపీఏ పొంది ఉండాలి. అలాగే గేట్‌లో అభ్యర్థులు కనీస స్కోరు 650 లేదా 100 కంటే తక్కువ ర్యాంకు ఉండాలి. దీంతో పాటు 8 సీజీపీఏ పాయింట్లు పొంది ఉండాలి. ఈ ఫెలోషిప్‌కి https://www.pmrf.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు