/rtv/media/media_files/2024/11/14/8MP2Ps6ogZV6b8DIZbYw.webp)
TGPSC key decision on groups exams
TGPSC: టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో మరికొన్ని పోటీ పరీక్షల సిబలస్ కూడా మార్చాలని, సరికొత్త సంస్కరణలు ప్రవేశపెట్టాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. గ్రూప్-1, గ్రూప్-2లో మళ్లీ ఇంటర్వ్యూ విధానం తీసుకురావాలని భావిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇంటర్వ్యూ పద్ధతి..
ఈ మేరకు సరికొత్త పద్ధతులకు సంబంధించి టీజీపీఎస్సీ అధ్యయనం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2 ఇంటర్వ్యూ పద్ధతిని పరిశీలిస్తున్నారని, 2015లో ఖరారు చేసిన పోటీ పరీక్షల సిలబస్ కూడా మార్చేందుకు కసరత్తులు చేస్తోందట. గతంలో 25 మంది విద్యావేత్తలతో టీజీపీఎస్సీ కమిటీని ఏర్పాటు చేయగా.. ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే చాలా కాలంగా పాతపద్ధతినే అమలు చేస్తున్న నేపథ్యంలో కొత్త కమిటీ నిర్వహించి కీలక మార్పులు చేయాలని యోచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Who is Sayali Satghare: అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టేసింది!
అభ్యర్థులు నష్టపోయే అవకాశం..
ఇక సిలబస్‌లో మార్చితే కొంతమంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. పాత బుక్స్ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. కొత్త సిలబస్ ప్రిపేర్ కావాలంటే మళ్లీ చాలా సమయం పడుతుంది. కొత్త పుస్తకాల కొనుగోలుతోపాటు కోచింగ్ సెంటర్లకు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే కొన్నేళ్లపాటు ఉద్యోగాలక కోసం ఎదురుచూస్తున్న వారి జీవితాలు ఆగమైపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని నూతన విధానాలను అమలు చేయాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన!
ఇదిలా ఉంటే.. దేశంలోని అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (PSU)కు కో-ఆర్డినేటర్‌గా TGPSC ఎంపికైంది. అన్ని PSUల చట్టపరమైన సమస్యలకు సమన్వయకర్తగా వ్యవహరించనుంది. సబ్జెక్టులకు అవసరమయ్యే నిపుణులను సెలెక్ట్ చేయనుంది. ఈ మేరకు బెంగళూరు వేదికగా PSC చైర్మన్ల 25వ జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రారంభించిన విషయం తెలిసిందే.