/rtv/media/media_files/2025/03/05/DcD25Vguj0XbUQyIxC3c.jpg)
south east central railway released notification for recruitment of trade apprentice posts
రైల్వే శాఖ ఇటీవల భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రూప్ డి లెవెల్ 1కి సంబంధించి మొత్తం 32వేలకు పైగా పోస్టులను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువు కూడా మార్చి 1తో పూర్తయింది. అయితే ఆ తర్వాత మరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 835 ఖాళీలను భర్తీ చేస్తోన్నారు. ఇప్పటికే దరఖాస్తు గడువు ప్రారంభం అయింది. పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి, సరైన అర్హత గల అభ్యర్థులు మార్చి 25 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
ఖాళీల సంఖ్య: 835
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
కార్పెంటర్: 38, సీఓపీఏ: 100, డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్): 11, ఎలక్ట్రీషియన్: 182, ఎలక్ట్రీషియన్(మెకానిక్): 05, ఫిట్టర్: 208, మెషనిస్ట్: 04, పెయింటర్: 45, ప్లంబర్: 25, మెకానిక్(ఏఆర్‌సీ): 40, ఎస్‌ఎండబ్ల్యూ: 04, స్టెనో(ఇంగ్లిష్): 27,
స్టెనో(హిందీ): 19, డీజిల్ మెకానిక్: 08, టర్నర్: 04, వెల్డర్: 19, వైర్‌మెన్: 90, కెమికల్ లాబోరేటరీ అసిస్టెంట్: 04, డిజిటల్ ఫోటోగ్రాఫర్: 02 పోస్టులు ఉన్నాయి.
Also Read : మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వయోపరిమితి: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: అకడమిక్ మార్కులు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: 25.02.2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 25.03.2025.
Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?