RRB పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఆఖరు తేదీ ఇదే!

ఆర్‌ఆర్‌బీ ఇటీవల 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6తో ముగియనుండగా మరో పది రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

New Update
RRB Ministerial and Isolated Categories Recruitment 2025 application date extended

RRB Ministerial and Isolated Categories Recruitment 2025 application date extended

రైల్వే రిక్రూట్‌‌మెంట్ బోర్డు (RRB) ఇటీవల ఓ గుడ్ న్యూస్ చెప్పింది. 32వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మరొక ప్రకటన వదిలింది. 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది.

పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇప్పటికే ఈ దరఖాస్తు ప్రక్రియ తేదీ ముగియగా.. దానిని రైల్వే బోర్డు (Railway Board) మరో పది రోజులు పొడిగించింది. దీంతో ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

మొత్తం ఖాళీల సంఖ్య - 1036

పోస్టుల వారీగా: 

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు: 338 పోస్టులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌: 187 పోస్టులు
లైబ్రేరియన్: 188 పోస్టులు
చీఫ్ లా అసిస్టెంట్‌: 54 పోస్టులు
జూనియర్ ట్రాన్స్‌లేటర్: 130 పోస్టులు
స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌: 59 పోస్టులు
పబ్లిక్ ప్రాసిక్యూటర్: 20 పోస్టులు
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 18 పోస్టులు
ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3: 12 పోస్టులు

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

మ్యూజిక్‌ టీచర్‌: 10 పోస్టులు
సైంటిఫిక్ సూపర్‌వైజర్: 03 పోస్టులు
సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌: 03 పోస్టులు
సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ ట్రైనింగ్‌: 02 పోస్టులు
ప్రైమరీ రైల్వే టీచర్‌: 03 పోస్టులు
అసిస్టెంట్ టీచర్: 02 పోస్టులు
ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ స్కూల్‌: 07 పోస్టులు

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

విద్యార్హత:

పోస్టును బట్టి డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ, టెట్‌, బీటెక్, ఎంబీఏ, బీఎడ్, బీఈ, ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌‌పీరియన్స్ ఉండాలి. 

దరఖాస్తు విధానం:

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

దరఖాస్తు ప్రారంభం తేదీ: 07.01.2025.
దరఖాస్తుకు చివరి తేదీ (గడువు పొడిగింపు): 16.02.2025.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు