/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rrb-recruitment-2024-jpg.webp)
RRB job Notification for 9970 Assistant Loco Pilot recruitment
RRB Recruitment: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా అర్హతతో 9970 అసిస్టెంట్ లోకోపైలెట్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://indianrailways.gov.in/.
మొత్తం పోస్టుల సంఖ్య: 9970
దరఖాస్తు ఫీజు:
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
- ఆన్ లైన్ ద్వారానే పేమెంట్ చేయాలి.
విద్యార్హత:
- టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
- ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు.
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
వయస్సు:
- ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంది.
- ఓబీసీ అభ్యర్థులు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంది.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంది.
- దివ్యాంగ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంది.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ఉద్యోగ ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ ల ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
వేతనం:
- ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.50,000 పైనే ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది, చివరి తేదీ అఫీషియల్ వెబ్ సైట్ లో త్వరలో ప్రకటించనున్నారు. అఫీషియల్ వెబ్ సైట్: https://indianrailways.gov.in/
job-notification | today telugu news | rtv telugu news