/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/un-emplo-jpg.webp)
సుప్రీంకోర్టులో ఉద్యోగాలు అంటే బాగా చదువుకోవాలమో అని భయపడక్కర్లేదు. కేవలం డిగ్రీతోనే వాటిని సంపాదించవచ్చును. ఏ డిగ్రీ ఉన్నా కూడా సుప్రీంకోర్టులో ఉద్యోగాల కోసం అప్లై చేయవచ్చును. దాంతో పాటూ ఇంగ్లీషు టైపింగ్ మాత్రం కచ్చితంగా రావాలి. అవును సుప్రీంకోర్టులో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ మార్చి 8.
విద్యార్హతలు..
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్శిటీ నుంచి ఏదేని డిగ్రీలో పాస్ అయి ఉండాలి. అలాగే 35 WPM(వర్డ్స్ పర్ మినిట్)తో ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. దాంతో పాటూ కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కచ్చితంగా ఉండాలి.
వయసు..
మార్చి 8 నాటికి అభ్యర్ధులు వయసు 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తుల ప్రారంభ తేదీ ఫిబ్రవరి 5, చివరి తేదీ మార్చి 8.
అప్లికేషన్ ఫీజు..
జనరల్/ EWS/ ఓబీసీలు రూ. 1000/- చెల్లించాలి. SC/ ST/ PH రూ. 250/- దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
పరీక్షా కేంద్రాలు..
లక్నో, ఢిల్లీ, పాట్నా, జైపూర్, అహ్మదాబాద్, అంబాలా, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఎర్నాకులం, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, విశాఖపట్నాలలో వ్రాత పరీక్ష ఉంటుంది. ముందు రాత పరీక్ష ఉంటుంది. అందులో పెలెక్ట్ అయిన వారికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. దాంతో పాటుగా టైపింగ్ టెస్ట్ కూడా చేస్తారు. దీని తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ గో త్రూ అయితే ధృవపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఉంటాయి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ Notification క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ Apply Online క్లిక్ చేయండి.