/rtv/media/media_files/2025/02/13/E0V4jl1zk1aw2sk0GYYn.jpg)
Jobs In Indian Navy
భారత నేవీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు ప్రకటన పడింది. మొత్తం 270 పోస్ట్ లకు పిలపునిచ్చారు. నేవీ భర్తీ చేస్తోన్న ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ పోస్టులు.. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్‌ల్లో ఉన్నాయి. అన్నీ లెవెల్-10 హోదా ఉద్యోగాలే. పెళ్ళి కాని మహిళలు, పురుషులు వటికి అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్ట్ లకు ఎటువంటి పరీక్షలు లేకుండానే ఉద్యోగంలోకి తీసుకుంటారు. కేవలం అకడమిక్ ప్రతిభ ద్వారానే ఫిల్టర్ చేసి ఉద్యగాలకు సెలెక్ట్ చేస్తారు. డిగ్రీ, పీజీల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారు అప్లై చేసుకుంటే ఉద్యోగం రాడం ఖాయం. వీటికి జీతం మొదటి నెల నుంచే లక్ష ఇవ్వనున్నారు.
సెలెక్షన్ విధానం...
ఒక్కో పోస్ట్ కూ నిర్ణీత సంఖ్యలో దరఖాస్తులను తీసుకుంటారు. దీనిని సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహిస్తుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దాని తరువాత ఉద్యోగం వచ్చినట్టే. సెలెక్ట్ అయిన వారికి నేవల్ అకాడెమీ, ఎజిమాళలో జనవరి, 2026 నుంచి 22 వారాలపాటు సంబంధిత విభాగాల్లో తర్ఫీదునిస్తారు. ఆ తర్వాత మరో 22 వారాలు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో తర్వాతి శిక్షణ ఉంటుంది. దీని తరువాత సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
జీతం..
నేవీలో ప్రకటించిన ఉద్యోగాలకు మూల వేతనం రూ. 56, 100. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ, మరికొన్ని ప్రోత్సాహకాలు కలిపి నెలకు 1, 10, 00రూ. ల జీతం అందుతుంది. ఈ ఉద్యోగాలకు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. ఇది రెండు నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. ఈ పోస్టులు షార్ట్ సర్వీస్ కమిషన్ లో ఉంటాయి. ఎంపికైనవారు పన్నెండేళ్లు విధుల్లో కొనసాగుతారు. తర్వాత రెండేళ్లు సర్వీసు పొడిగిస్తారు. అంటే మొత్తం పధ్నాలుగేళ్ళు నేవీలు ఉద్యోగం చేయవచ్చును.
పోస్ట్ లు , ఖాళీలు..
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్:
జనరల్ సర్వీస్‌లో 60 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 22, పైలట్ 26 ఖాళీలకు బీఈ/బీటెక్‌లో 60, పది, ఇంటర్‌లోనూ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. లాజిస్టిక్స్ 28 ఖాళీలకు ఎందులోనైనా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ లేదా ఎమ్మెస్సీ(ఐటీ)/ఎంసీఏ లేదా బీఎస్సీ/బీకాంతోపాటు లాజిస్టిక్స్/సప్లై చెయిన్‌లో పీజీ డిప్లొమాలో పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చును.
ఎడ్యుకేషన్ బ్రాంచ్:
ఇందులో అన్ని విభాగాల్లోనూ కలిపి 15 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఆ పోస్టుల ప్రకారం బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివినవారు అర్హులు.
టెక్నికల్ బ్రాంచ్:
ఇంజినీరింగ్ బ్రాంచ్ 38, ఎలక్ట్రికల్ బ్రాంచ్ 45, నేవల్ కన్‌స్ట్రక్టర్ 18 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లు అన్నింటికీ ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చును. ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. బెంగళూరు, భోపాల్, విశాఖ, కోలకత్తాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ కింది వెబ్ సైట్ లో దరఖాస్తులను నింపాలి. https://www.joinindiannavy.gov.in/