/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T191717.265-jpg.webp)
APPSC key changes Group 1 examination pattern
APPSC: గ్రూప్ 1 పరీక్షా విధానంలో ఏపీపీఎస్సీ కీలక మార్పులు చేసింది. ఇకపై మెయిన్స్ ఎగ్జామ్స్‌కు వైట్ పేపర్‌తో కూడిన బుక్‌లెట్‌ను మాత్రమే అందజేస్తామని తెలిపింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రూల్డ్ బుక్‌లెట్ స్థానంలో తెల్ల పేపర్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజబాబు ప్రకటించారు. ఈ మేరకు పరీక్షలు బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే రాయాలని తెలిపారు. స్కెచ్ పెన్నుతో రాస్తే మాల్‌ప్రాక్టీసు కింద గుర్తిస్తామన్నారు. మూల్యాంకనం చేయడం కుదరదని, కొత్త బుక్‌లెట్‌ను త్వరలో వెబ్‌సైట్‌లో పెడతామని స్పష్టం చేశారు.
ఆప్షన్లు మార్చుకోవచ్చు..
ఇదిలా ఉంటే.. ఏపీలో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు సంబంధించి ఆప్షన్లు మార్చుకోవడానికి మరోసారి ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. పరీక్ష రాసే అభ్యర్థులు మాధ్యమం, పోస్టులు, జోనల్ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల వంటి వాటిలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ మార్పులు చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది. అభ్యర్థులు ఈ తేదీలోగా వెంటనే మార్చుకోండి.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
ఇక గ్రూప్ 1 లో 2023 పోస్టుల భర్తీకి మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ మే 03 నుంచి 09 తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. గ్రూప్ 1 మెయిన్స్ మొత్తం 7 పేపర్లకు నిర్వహించనున్నారు.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
group-1 | mains | telugu-news | today telugu news