/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ssc-chsl-exams-jpg.webp)
APPSC: నిరుద్యోగులకు అలర్ట్. APPSC పలు పోటీ పరీక్షల తేదీలను ప్రకటించింది. పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఎగ్జామ్స్ జూన్ 16 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. CBT విధానంలో పరీక్షలు జరగనున్నాయి. రోజూ రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. జూన్ 20,21, 22 ఈ మూడు రోజులు పరీక్షలకు సెలవులుంటాయని తెలిపింది.
గ్రూప్ 2 నియామకాలు..
ఇదిలా ఉంటే.. గత రెండు రోజుల క్రితం ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి. 905 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించగా.. సర్టిఫికెట్ పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ కోటాతో కలిపి 2,517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. కాల్ లెటర్ల ద్వారా వీరికి సమాచారం అందించనున్నట్లు అధికారులు అధికారులు తెలిపారు. గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా... హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించారు.
exams | date | telugu-news | today telugu news