Japan Earthquake : జపాన్‌లో 62కు చేరుకున్న మృతుల సంఖ్య జపాన్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 62 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. భవనాల శిథిలాలు ఇంకా తొలగిస్తుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 03 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Japan : ఒకరోజు వ్యవధిలో 155 సార్లు వచ్చిన భూకంపాలు(Earthquake) జపాన్(Japan) ను అతలాకుతలం చేశాయి. దీని ప్రభావం అక్కడ ప్రజల మీద భారీగానే పడింది. ఇప్పటివరకు భూకంపం దాటికి 62 మంది చనిపోయారు. మరో 300 మంది దాకా గాయపడ్డారు. వీరిలోకూడా 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈరోజు కూడా శిథిలాల తొలగింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం క్లియర్ చేయడానికి మరో నాలుగైదు రోజులు పట్టొచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు. Also Read:గృహలక్ష్మి కాదు అభయహస్తం…రేవంత్ సర్కార్ మరో నిర్ణయం అన్ని సార్లు భూమి కంపించడం వలన ఇషికావా ప్రిఫెక్చర్, నోటో ద్వీపకల్పం బాగా దెబ్బతిన్నాయి. వేలాది భవనాలు కుప్పకూలాయి. కొన్ని ఇళ్ళు మంటల్లో కాలిపోయాయి. దాదాపు 32 వేలమంది దాకా నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం వీరందరూ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికీ చాలా మంది ఇంకా సాయం కోసం ఎదురు చూస్తున్నారని జపాన్ ప్రధాన మంత్రి పుమియో కిషిదా(Fumio Kishida) తెలిపారు. ప్రభుత్వం, సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో మునిగిపోయారని...అందరికీ ఆశ్రయం కల్పించి ఆదుకుంటామని చెబుతున్నారు. మరోవైపు జపాన్‌లో ప్రకృతి ఇంకా శాంతించలేదు. ఎక్కడ అయితే భూకంపం వచ్చిందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు భారీ వష్రం పడే అవకాశం ఉందని వాతావరణ కేందరం హెచ్చరిస్తోంది. దీనివలన భూకంపం ధాటికి భారీగా కదిలిన కొండచరియలు ఇప్పుడు విరిగి పడే అవకాశం ఉందని చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. #death #japan #earth-quake మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి