IT Raids: తెలంగాణలో కొనసాగుతున్న ఐటీ దాడులు.. ఇది వారి పనే అంటున్న కాంగ్రెస్ నేతలు.. హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కేఎల్ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. By Shiva.K 02 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి IT Raids in Telangana: ఎన్నికలు సమీస్తున్న వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గురువారం నాడు హైదరాబాద్(Hyderabad) బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కాంగ్రెస్(Congress) నాయకురాలు చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు(IT Raids) నిర్వహించారు. వీరి ఇళ్లలో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కోకాపేటలో గిరిధిర్ రెడ్డికి సంబంధించిన ఈడెన్ గార్డెన్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కేఎల్‌ఆర్, అయన బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 6 గంటలుగా కొనసాగుతున్న ఈ సోదాలను సీఆర్పీఎఫ్ బలగాల రక్షణలో, బ్యాంక్ అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఇక ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. దాదాపు పది చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పారిజాత నర్సింహారెడ్డి, కేఎల్ఆర్ నివాసాలు, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారులతో పాటు ఎన్నికల నోడల్ అధికారులు కూడా సంయుక్తంగా సోదాలు చేపట్టారు. తుక్కుగూడలోని కేఎల్ఆర్ పార్టీ కార్యాలయంలోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకు అధికారుల సమక్షంలో ఈ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇక పార్టీ కార్యాలయ వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. పార్టీ కార్యాలయంలో నగదుతో పాటు కీలక డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమారం అందుతోంది. శంషాబాద్ కేఎల్ఆర్ ఫామౌజ్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. KLR ఫామౌజ్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఐటీ సోదాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ఆర్ ప్రస్తుతం మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. బీఆర్ఎస్, బీజేపీ కుట్రతో ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తమపై ఐటీ దాడుల వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉంటుందని ఆరోపించారు పారిజాత. ముఖ్యంగా మంత్రి సబతి ఈ దాడులకు కారణం అని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఓటమి భయంతోనే ఇలా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇకపోతే.. తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయడంపై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఐటీ దాడులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐటీ అధికారులకు అందిన సమాచారం మేరకు సోదాలు చేపడతారని, ఇందులో ఎవరి ప్రోత్బలం ఉండదని క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి. Also Read: కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు.. కేంద్ర సహకారంతోనే ఐటీ దాడులు: రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు హీటెక్కుతున్న రాజకీయాలు.. తెలంగాణకు రానున్న ప్రధాని #telangana-news #congress #telangana #hyderabad #politics #hyderabad-politics #telangana-politics #it-raids-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి