ఆగని రచ్చ.. టీటీడీ ఛైర్మన్‌గా భూమన నియామకంపై చల్లారని మంటలు టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై మాటలు మంటలు కొనసాగుతున్నాయి. ఓ అన్యమతస్తుడిని పవిత్రమైన టీటీడీ ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారని విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వైసీపీ టార్గెట్‌గా ఫైర్ అవుతున్నారు. ఇక రేపు(ఆగస్టు 10) టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న భూమన కరుణాకర్ రెడ్డి.. ఇప్పటికే జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. By Trinath 09 Aug 2023 in తిరుపతి New Update షేర్ చేయండి TTD chairman controversy: టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఎలా నియమిస్తారని బీజేపీ, టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని, ఎన్నికల అఫిడవిట్‌లో కూడా క్రిస్టియన్‌గా పేర్కొన్నారని వైసీపీకి వ్యతిరేకంగా మండిపడుతున్నారు. ఓ అన్యమతస్తుడిని తిరుమల బోర్డుకు చైర్మన్‌గా ఎలా నియమిస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయంలో రాజీ లేకుండా పోరాడుతామని , కరుణాకర్ రెడ్డిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఎలా కూర్చోబెడతారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి నిలదీస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగిందనీ, ఆ విషయంపై గలం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపి వేయడం జరిగిందన్నారు. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్దమవుతున్నదని అన్నారు హిందూ ధర్మం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తికే ఇలాంటి బాధ్యతలు అప్పగించాలి కానీ.. వేరే మతానికి చెందిన వారిని ఎలా నియమిస్తారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. జగన్‌ని కలిసిన భూమన కరుణాకర్‌రెడ్డి: టీటీడీ కొత్త ఛైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్‌రెడ్డి ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు. టీటీడీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు భూమన కరుణాకర్ రెడ్డి. రేపు(ఆగస్టు 10) ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన తనయుడు భూమన అభినయ్ రెడ్డి సీఎంని కలిశారు. ఆగని రచ్చ: భూమనకు పోస్ట్ ఇవ్వడంపై దుమారం చెలరేగుతూనే ఉంది. ఆయన హిందుమతానికి చెందినవారు కాదని భూమన కూతురి వివాహాం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగిందని హిందూ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. తిరుమల దేవస్థానం పవిత్రత, భక్తుల మనోభావాలను జగన్ సర్కార్ ఎందుకు గాలికొదిలేసిందని ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీ నాయకులు, హిందూ సంఘాల నేతలే కాకుండా తెలంగాణలో కూడా ఈ వివాదంపై స్పందిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గళం విప్పారు. హిందూ ధర్మాన్ని జగన్ చాలా తక్కువగా చూస్తున్నారంటూ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో క్రైస్తవుడుగా పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్‌గా జగన్ నియమించారనీ, ఇది అత్యంత దారుణమైన చర్య అన్నారు. టీటీడీ చైర్న్ గా హిందువులనే నియమించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఏపీలో హిందువులు మేలుకోవాలి లేకపోతే నష్టపోకతప్పదన్నారు. #ttd #bhumana-karunakar-reddy #purandeshwari #ttd-chairman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి