IAS Smitha Sabrwal:ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం..ఆసక్తికరంగా ట్వీట్

సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్ళేందుకు స్మితా దరఖాస్తు పెట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఆమె పెట్టిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

New Update
IAS Smitha Sabrwal:ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం..ఆసక్తికరంగా ట్వీట్

స్మితా సబర్వాల్...సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. చాలా పద్ధతిగల, స్ట్రిక్ట్ అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఈమెను కార్యదర్శిగా నియమించారు. దీంతో పాటూ నీటి పారుదల శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటూ మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. ఇప్పుడు మళ్ళీ ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎం ఆఫీసుకు స్మితా గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఈమె కలవకపోవడం కూడా ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇరిగేషన్‌పై రివ్యూ మీటింగ్‌కూ స్మితా అటెండ్ కాలేదు. దీంతో స్మితా ఏం చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Also Read:పేదలకు ఇళ్ళ పంపకాలపై ఫోకస్..ధరణి పేరులో మార్పు?

దీనికి తోడు ఈరోజు చేసిన స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఒకటి ఇంట్రస్టింగ్ గా మారింది. 23ఏళ్ల కిందటి ఫోటో షేర్ చేస్తూ..కొత్త ఛాలెంజ్‌కు ఎప్పుడైనా రెడీ అంటూ పోస్ట్ చేశారు. దీంతో స్మితా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్ళేందుకు చూస్తున్నారని తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. కోహ్లీ 70 పరుగులు, పడిక్కల్ 50 పరుగులతో చెలరేగిపోయారు.

New Update
RCB Vs RR

RCB Vs RR

టార్గెట్ ఎంతంటే?

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

రికార్డు మిస్

కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్‌ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

telugu-news | virat-kohli | IPL 2025 | rcb-vs-rr | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment