Cricket:హార్దిక్ వెనక్కి రావడంపై బుమ్రా అసహనంగా ఉన్నాడా?

గత కొన్ని రోజులుగా ఐపీఎల్, హార్దిక్ పాండ్యా...ఇదే టాపిక్ నుడస్తోంది క్రికెట్ ఫీల్డ్ లో. ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారింది ఆల్ రౌండర్ హార్దిక్ ట్రేడింగ్. కానీ ఇప్పుడదే ముంబై స్టార్ బౌలర్ బుమ్రాను తీవ్ర అసహనానికి గురి చేస్తోందని టాక్.

New Update
Cricket:హార్దిక్ వెనక్కి రావడంపై బుమ్రా అసహనంగా ఉన్నాడా?

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా...గత రెండేళ్ళుగా గుజరాత్ టైటాన్స్ ను పరుగెట్టించిన కెప్టెన్. రెండు సార్లు ఫైనల్స్ వరకూ తీసుకెళ్ళాడు. ఆరంభం నుంచే ఆజట్టును విజయాల బాట నడిపించాడు. అయితే అంతకు ముందు హార్దిక్ ముంబయ్ కు ఆడేవాడు. మధ్యలో అతను గాయాలబారిన పడ్డప్పుడు మంబయ్ ఫ్రాంఛైజీ అతణ్ణి వదిలించుకుంది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బోలెండత డబ్బు ఇచ్చి మరీ వెనక్కి రప్పించుకుంది. ఈ ట్రేడింగ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. ఐపీఎల్ చరిత్రలోనే హాట్ టాపిక్ గా కూడా నిలిచింది.

ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ 15 కోట్లు ఇచ్చి హార్దిక్ పాండ్యాను తీసుకుంది. దీనికి అందరూ సూపర్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. అదెవరంటే..ఆ జట్టు స్టార్‌ బౌలర్‌, టీమిండియా పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా. ఇతను మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీని వెనక అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే కారణం అని చెబుతున్నారు. కొన్నిసార్లు నిశ్శబ్దమే అత్యుతమ సమాధానంగా నిలుస్తుంది అంటూ బుమ్రా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ టీ20లకు స్వస్తి పలకాలనే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ తిరిగి ముంబైకి రావడంతో రోహిత్ తర్వాత అతనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అవుతాడు. దీన్ని అఫీషియల్ గా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ అది కాయం అని చెబుతున్నారు.
ఇప్పుడు ఈ కారణమే బుమ్రాను అసహనానికి గురిచేస్తోంది. రోహిత్‌ తర్వాత ముంబైకు బుమ్రా కెప్టెన్ కావాలనుకున్నాడు. అందుకే ఇన్నాళ్ళు ఆ జట్టుతో ట్రావెల్ చేశాడు కూడా. అయితే ఇప్పుడు పాండ్యా రీ ఎంట్రీతో బుమ్రా కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుమ్రా పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేసిన బుమ్రా.. ఆర్సీబీని ఫాలో అవుతున్నాడంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. ముంబైని వదిలేసి ఆర్సీబీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు