Jobs: ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులైన వారు మే 24వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 May 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి IPPB Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులైన వారు మే 24వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. బీటెక్/బీఎస్సీ/ఎంసీఏ తదితర క్వాలిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపికైన వారికి హోదాను బట్టి గరిష్ఠంగా రూ.25లక్షల వరకు వార్షిక వేతనం అందించనున్నారు. దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి నోటిఫికేషన్‌లోని ముఖ్యంశాలు 1.మొత్తం పోస్టులు 54. ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) 28, ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) 21, ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) 5 పోస్టుల చొప్పున ఉన్నాయి. 2.విద్యార్హతలు: బీఈ/ బీటెక్ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ క్వాలికేషన్తో పాటు ఆయా పోస్టులను బట్టి కనీసం ఏడాది నుంచి మూడేళ్ల వరకు పని అనుభవం ఉండాలి 3.వేతనం: ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000; ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులకు రూ.15,00,000; ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000 చొప్పున అందించనున్నారు. 4.దరఖాస్తు ఫీజు: రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.150 5.ఎంపిక ప్రక్రియ : అసెస్మెంట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ముందుగా ఢిల్లీ/ ముంబయి/ చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. 6.అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులకు 22 నుంచి 30 ఏళ్లు వయోపరిమితి ఉండగా.. కన్సల్టెంట్ పోస్టులకు 22 నుంచి 40 ఏళ్లు, సీనియర్ కన్సల్టెంట్‌కు 22 నుంచి 45 ఏళ్లుగా ఉంది. Also Read: ఇక ఇంట్లోనే ఉండండి..25మంది ఉద్యోగాలు పీకేసిన ఎయిర్ ఇండియా #telugu-news #jobs #bank-jobs #latest-jobs-in-telugu #ippb మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి