IPL 2024 Playoffs War : మరింత రసవత్తరంగా ప్లే ఆఫ్స్ పోరు.. మూడు స్థానాల కోసం ఐదు జట్ల మధ్య పోటీ?

ఐపీఎల్ 2024 సీజన్ లో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. అన్ని జట్లలో కోల్ కత్తా టీమ్ మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం 5 జట్లు పోటీ పడనున్నాయి.

New Update
IPL 2024 Playoffs War : మరింత రసవత్తరంగా ప్లే ఆఫ్స్ పోరు.. మూడు స్థానాల కోసం ఐదు జట్ల మధ్య పోటీ?

IPL 2024 Playoffs : ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ లో కేవలం 8 మ్యాచ్ లే మిగిలున్నాయి. అన్ని జట్లలో కోల్ కత్తా టీమ్(Kolkata Team) మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం సుమారు 7 జట్లు పోటీ పడనున్నాయి. కాగా ఆదివారం రాజస్థాన్ ను చెన్నై, ఢిల్లీని బెంగళూరు ఓడించడంతో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.

ఆ రెండు టీమ్స్ కూడా దాదాపు ఖాయమే

కోల్ కత్తా తో పాటు 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ రాయల్స్ దాదాపు ప్లే ఆఫ్స్ కి చేరినట్టే. మిగిలిన రెండు మ్యాచ్ లలో ఒక్కటి గెలిచినా రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కి చేరుతుంది. ఒకవేళ రెండూ ఓడినా కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక సన్ రైజర్స్ ఇప్పటి వరకు 14 పాయింట్లతో మూడో ప్లేస్ లో ఉంది.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది. మెరుగైన రన్ రేట్ ఉంది కాబట్టి రెండింటిలో ఒక్కటి గెలిచినా నాకౌట్ కి వెళ్లొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజస్థాన్, హైదరాబాద్ రెండు జట్లు కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.

లక్నో కి కూడా ఛాన్స్ ఉంది

పైన చెప్పినట్లు జరిగితే లాస్ట్ బెర్త్ కోసం చెన్నై, లక్నో, బెంగళూరు మధ్య పోటీ ఉంటుంది. ప్రెజెంట్ 12 పాయింట్లతో ఉన్న లక్నో(Lucknow) మిగిలిన రెండు మ్యాచ్ లలో భారీ తేడాతో గెలిస్తేనే నాకౌట్ దశకు చేరే ఛాన్స్ ఉంటుంది.

బెంగళూరు ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే?

RCB ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే హైదరాబాద్ తమ రెండు మ్యాచ్ లలో ఒకటి లేదా రెండు మ్యాచుల్లో ఓడాలి. దీంతో పాటూ లక్నో మిగిలిన రెండు మ్యాచుల్లో ఒకదాంట్లో విజయం సాధించాలి. వీటితో పాటూ ముఖ్యంగా మే 18 న చెన్నై తో జరగనున్న మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలి. అదికూడా 18 పరుగుల తేడా లేదా అంతకంటే ఎక్కువ తేడాతో గెలవాలి. లేకుంటే చెన్నై నిర్ధేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేధించాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు