IPL 2024: ఇక ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు.. నేడే ఐపీఎల్‌ స్టార్ట్!

పరుగుల పండుగ వచ్చేసింది.ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఇవాళ్టి నుంచి ఆరంభంకానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైతో ఆర్‌సీబీ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ప్రారంభ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుండగా.. మిగతా మ్యాచులు 7.30 గంటలకే షురూ అవుతాయి.

New Update
IPL 2024: ఇక ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు.. నేడే ఐపీఎల్‌ స్టార్ట్!

ఐపీఎల్‌ అంటే ఆనందం.. ఐపీఎల్‌ అంటే ఉద్వేగం.. ఐపీఎల్‌ అంటే వివాదం.. ఐపీఎల్‌ అంటే పిచ్చి.. ఇవాళ్టి నుంచే ఐపీఎల్‌ ప్రారంభం. ఐపీఎల్‌ మొదలవుతుందంటే ఫ్యాన్స్‌లో తెలియదని ఏదో ఆనందం. ఈ రెండు నెలల పాటు ఫుల్‌గా ఫ్యాన్‌ వార్స్‌ ఉంటాయి. టీమిండియా ఫ్యాన్స్‌ పది వర్గాలు చీలిపోయి మరి తిట్టుకుంటారు. తర్వాత మళ్లి కలిసిపోతారు. ఇదంతా ఓ అండర్‌స్టండింగ్‌.. క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రమే ఉన్న మెచ్చురిటీ ఇది. అందుకే ఐపీఎల్‌ ప్రారంభమవుతుందంటే దేశం మొత్తం టీవీలకు అత్తుకుపోతుంది. ఇక ఈ ఏడాది ఎలక్షన్స్‌ కూడా ఉన్నాయి. దీంతో హీట్‌ రెట్టింపైంది. దేని దారి దానిదేనైనా ప్రజలకు మాత్రం కావాల్సినంత వినోదం దక్కుతుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఈ సాలా కప్‌ నమ్‌దే బ్యాచ్‌ బరిలోకి దిగుతోంది.

ధోనీ కెప్టెన్‌ కాదు.. ఫ్యాన్స్‌ ఎమోషనల్‌:
నేటి మ్యాచ్‌లో, MA చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనుంది. ఎంఎస్‌ ధోనీ చెన్నై కెప్టెన్సీ నుంచి వైదోలిగిన విషయం తెలిసిందే. రుతురాజ్‌ కెప్టెన్సీలో చెన్నై బరిలోకి దిగనుంది. చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌ అంటే అంతా పసుపు మయమే ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీపై కూడా అభిమానుల చూపు పడంది. ఎందుకంటే ఇటీవలే తండ్రైన కోహ్లీ కాస్త్‌ గ్యాప్‌ తర్వాత గ్రౌండ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. అటు చెన్నై టీమ్‌లో డెవాన్ కాన్వే అందుబాటులో లేడు. దీంతో రచిన్ రవీంద్ర చెన్నై తరుఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేయబోతున్నారు.

CSK జట్టు(అంచనా): రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (WK), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మహేశ్ తీక్షణ
ఇంపాక్ట్ ప్లేయర్: అజింక్యా రహానే

RCB టీమ్‌ (అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లీ, కెమెరూన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లామ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్), సుయాష్ ప్రభుదేసాయి, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్: ఆకాష్ డీప్

హెడ్‌ టు హెడ్‌:
మొత్తం మ్యాచ్‌లు: 31
చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన మ్యాచ్‌లు: 20
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన మ్యాచ్‌లు: 10

Also ReaD: మనం మనం ఎప్పటికైనా ఒక్కటే.. రోహిత్‌ను కౌగలించుకున్న హార్దిక్

Advertisment
Advertisment
తాజా కథనాలు