iphone: ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు

2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేంద్రం కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించడంతో.. యాపిల్‌ తన ఐ-ఫోన్‌ 13,14,15 సిరీస్‌ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఐ-ఫోన్‌ ప్రో లేదా ప్రో మ్యాక్స్‌ మోడల్‌ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి 6 వేల వరకు తగ్గనున్నాయి.

New Update
iphone: ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు

స్మార్ట్‌ఫోన్లు వాడే చాలమందికి ఐఫోన్ కొనుక్కోవాలనే ఒక డ్రీమ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్‌న్యూస్. యాపిల్‌ తన ఐ-ఫోన్‌ 13,14,15 సిరీస్‌ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ మీద కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యాపిల్‌ ఫొన్‌ ధరలు తగ్గించింది. ఐ-ఫోన్‌ ప్రో లేదా ప్రో మ్యాక్స్‌ మోడల్‌ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి 6 వేల వరకు తగ్గాయి.

Also read: కమలా హారీస్‌కు మద్దతిచ్చిన బరాక్‌ ఒబామా.. వీడియో వైరల్

ఐఫోన్‌ 13, ఐఫోన్ 14, ఐఫోన్‌ 15 లతో పాటు భారత్‌లో తయారయ్యే ఐఫోన్ల ధరలు రూ.300, ఐఫోన్ ఎస్‌ఈ ధరలు రూ.2300 తగ్గనున్నాయి. యాపిల్‌ కంపెనీ తన ఐ-ఫోన్‌ ప్రో మోడల్‌ ఫోన్ల ధరలు తగ్గించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈసారి బడ్జెట్‌లో కేంద్రం.. కస్ట్స్‌ డ్యూటీని 20 నుంచి 15 శాతానికి తగ్గించింది. వాస్తవానికి కొత్త ఐ-ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిప్పుడు పాత మోడల్‌ ఫోన్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక యాపిల్ ధరలు తగ్గింపుతో పాటు డీలర్లు,రీసెల్లర్లు తమ వద్ద నిల్వ ఉన్న ఫోన్‌లను అమ్మేందుకు అదనపు డిస్కౌంట్‌లు కూడా ఇస్తుంటారు.

Also Read: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు

యాఫిల్‌ తగ్గించిన ధరల వివారాలు

ఐ-ఫోన్ ఎస్ఈ - రూ.49,900 నుంచి రూ. 47,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 13 –   రూ. 59,900 నుంచి రూ.59,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 14 –   రూ.69,900 నుంచి రూ. 69,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 14 ప్లస్ – రూ.79,900 నుంచి రూ.79,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 15 –    రూ.79,900 నుంచి రూ.79,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 15 ప్లస్ –  రూ.89,900 నుంచి రూ.89,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 15 –   రూ.1,34,900 నుంచి రూ. 1,29,800కి తగ్గింపు
ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ – రూ. 1,59,900 నుంచి రూ.1,54,000కి తగ్గింపు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం.. గ్రాము ఎంత ఉందంటే?

నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
Gold rate

Gold rate

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైనే దాటింది. లక్ష లేనిదే బంగారం కొనలేరు. అందులోనూ తులం బంగారం అంటే చేతిలో లక్ష కంటే ఎక్కువగానే డబ్బులు పెట్టుకోవాలి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

Advertisment
Advertisment
Advertisment