Zelenskyy: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు

పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ త్వరలో చనిపోతాడని ఆయన అన్నారు. తర్వాత రష్యా, ఉక్రెయిన్ వార్ ఆగిపోతుందని జలెన్‌స్కీ అన్నారు.

New Update
Zelenskyy comments on putin

Zelenskyy comments on putin Photograph: (Zelenskyy comments on putin )

గతకొద్ది రోజులుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంపై అనేక పుకార్లు పుట్టుకొస్తున్నాయి. పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పుతిన్‌పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ త్వరలో చనిపోతాడని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. త్వరలో పుతిన్ చనిపోగానే రష్యా, ఉక్రెయిన్ వార్ ఆగిపోతుందని జలెన్‌స్కీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్ స్కీ కామెంట్స్ సంచలనంగా మారాయి. రష్యా యుద్దం ఇంకా కొనసాగాలని కోరుకుంటుందని జెలెన్ స్కీ అన్నారు. శాంతి చర్చలు జరుగుతున్నప్పుటికీ రష్యా యుద్దాన్నే కోరుకుంటుందని ఆయన అన్నారు.

Also read: షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్‌ మెడిసిన్ ధరలు

Zelensky Says Russian President Will Die

చాలా నెలలుగా పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు, పుకార్లు వస్తున్నాయి. పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారని ధృవీకరించని నివేదికలు కూడా ఉన్నాయి. రష్యా నాయకుడు నిరంతరం దగ్గుతున్నట్లు, ఆయన చేతులు, కాళ్ళు ఒణుకుతున్నట్లు కూడా వీడియోలు బయటకు వచ్చాయి. కానీ వాటినిపై పుతిన్ స్పందించలేదు. దీంతో పుకార్లకు మరింత బలం చేకూరింది.

Also read: అమెరికాలో ఆ కార్లపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్

Also Read :  ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు

ఇంధన లక్ష్యాలపై దాడులను 30 రోజుల పాటు నిలిపివేయడానికి ఉక్రెయిన్, రష్యా అంగీకరించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. గత వారం అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సున్నితమైన కాల్పుల విరమణ ఉన్నప్పటికీ డ్రోన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వారం రష్యా 117 డ్రోన్ దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ పేర్కొంది. మూడు సంవత్సరాల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జెలెన్స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్ నగరం అతిపెద్ద డ్రోన్ దాడికి గురైంది. మరోవైపు, క్రిమియాలోని గ్యాస్ నిల్వ కేంద్రంపై, కుర్స్క్ మరియు బ్రయాన్స్క్ ప్రాంతాలలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. తొమ్మిది ఉక్రేనియన్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

Also Read :  కిక్కే కిక్కు.. వారికి ఫ్రీగా IPL మ్యాచ్ పాస్‌లు- ఇలా అప్లై చేసుకోండి

 

russia in ukraine | putin vs zelensky | zelenskyy | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment