Zelensky-Trump: ఆయనతో వాగ్వాదం చాలా విచారకరం!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తో వాగ్వాదం పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మరోసారి స్పందించారు. ఈ పరిణామం తీవ్ర విచారకరమని అన్నారు. ఉక్రెయిన్‌ లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్‌ నాయకత్వంలో పని చేసేందుకు తాను, తన బృందం సిద్ధంగా ఉందన్నారు.

New Update
Zelensky

Zelensky Photograph: (Zelensky)

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తో వాగ్వాదం పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మరోసారి స్పందించారు. ఈ పరిణామం తీవ్ర విచారకరమని అన్నారు. ఉక్రెయిన్‌ లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్‌ బలమైన నాయకత్వంలో పని చేసేందుకు తనతో పాటు తనబృందం సిద్ధంగా ఉందన్నారు.

Also Read:  Serbia: స్మోక్ బాంబులతో దడదడలాడిన సెర్బియా పార్లమెంటు

కీవ్‌ కు అందించే సైనిక  సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే జెలెన్‌ స్కీ నుంచి ఈ స్పందన వచ్చింది. యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్‌ స్కీ పేర్కొన్నారు.తొలిదశలో ఖైదీల విడుదల తో పాటు క్షిపణులు, దీర్ఘ శ్రేణి డ్రోన్లు,ఇంధన వనరులు,ఇతర మౌలిక సదుపాయాల పై బాంబు దాడుల పై నిషేధం వంటి వాటికి రష్యా అంగీకరిస్తే తదుపరి దశల ద్వారా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు.

Also Read: Champions Trophy: హిట్ మ్యాన్ ప్రపంచ రికార్డ్..అత్యధిక సిక్స్ లు..

తాము సిద్ధంగా...

బలమైన తుది ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పని చేసేంఉదకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఉక్రెయిన్‌ తన సార్వభౌమత్వాన్ని , స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడంలో అమెరికా అందించిన సాయాన్ని ఎంతగానో గౌరవిస్తామని జెలెన్‌ స్కీ పేర్కొన్నారు.ఉక్రెయిన్ కు ట్రంప్‌ జావెలిన్‌ ఆయుధాలను అందించిన తర్వాత మారిన పరిస్థితులు తమకు గుర్తున్నాయన్నారు.శుక్రవారం వైట్‌ హౌస్‌ లో ట్రంప్ తో జరిగిన సంభాషణ ఆశించిన మేర జరగలేదున్నారు. 

ఆ పరిణామం చాలా విచారకరమన్న ఆయన..తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమన్నారు. భవిష్యత్తు సహకారం, సంప్రదింపులు నిర్మాణాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అంతకుముందు లండన్‌ లో ఐరోపా దేశాధినేతల సమావేశం అనంతరం మాట్లాడిన జెలెన్‌ స్కీ..అగ్రరాజ్యంతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అమెరికాకు ఉక్రెయిన్‌ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని, ట్రంప్‌ తో మరోసారి భేటీకి వెళ్తానన్నారు.రష్యాతో యుద్ధం ముగింపు ఇంకా సుదూర తీరంలోనే ఉందని, అప్పటి వరకు అగ్రరాజ్యం సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్‌ మిలిటరీ సాయం నిలిపివేయడం గమనార్హం.

అయతే ఇది తాత్కాలికమేనని వైట్‌ హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. రష్యాతో శాంతి చర్చలకు కీవ్‌ పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 

Also Read: IND vs AUS:  టీమిండియా భారం కోహ్లీపైనే.. మ్యాచ్‌ను గెలిపిస్తాడా?

Also Read: Meenakshi Natarajan: మాట వినకుంటే వేటు తప్పదు.. ఆ నేతలకు మీనాక్షి సీరియస్ వార్నింగ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు