/rtv/media/media_files/2026/03/28/yemen-2026-03-28-21-40-25.jpg)
Yemen’s Houthis launch missile attack on Israel as war with Iran intensifies
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన యుద్ధం 28వ రోజుకు చేరింది. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా.. మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు సపోర్ట్ ఇచ్చే యెమెన్‌కు చెందిన హౌతీలు యుద్ధంలోకి దిగారు. ఇజ్రాయెల్‌లో ఉన్న సైనిక స్థావరాలే టార్గెట్‌గా మిస్సైల్స్‌తో దాడులు చేశారు. యెమెన్ నుంచి వచ్చిన క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
Also Read: మేము చెప్పేది వినాల్సిందే.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ సంచలన హెచ్చరిక
అయితే ఈ దాడలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా వెల్లడించాయి. యెమెన్ నుంచి వచ్చిన క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకొని ఉండొచ్చని పేర్కొంది. గతేడాది గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో హౌతీలు కూడా పాలస్తీనియులకు సపోర్ట్‌గా ఇజ్రాయెల్‌పై దాడులు చేశారు. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ రూట్‌లో వెళ్లే నౌకలపై విరుచుకుపడ్డారు.
Also Read: కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ భీకర దాడులు.. వీడియో వైరల్
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొజ్తబా ఖమేనీ కూడా చనిపోయి ఉండొచ్చని తాజాగా ట్రంప్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుంకుంది. అయితే ఇరాన్ మాత్రం ఆయన బ్రతికే ఉన్నాడని చెబుతోంది. కానీ ట్రంప్ మాత్రం ఖమేనీ చనిపోయిన విషయాన్ని ఇరాన్ దాస్తోందని అంటున్నారు.
మరోవైపు ట్రంప్ ఇరాన్‌పై దాడులను 10 రోజులకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేసింది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల దాడి చేసింది. ఈ దాడుల వల్ల ఇరాన్ ఎయిర్‌పోర్టు రాడార్ వ్యవస్థ ధ్వంసమైపోయింది. ఇరానే ఈ దాడులు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
Follow Us