/rtv/media/media_files/2025/04/04/6611Lq1xeothsGTqQPHx.jpg)
pentagon
అమెరికా బలగాలు ఇటీవల యెమెన్ పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి లీకైనట్లు బయటికొచ్చిన సంగతి తెలిసిందే. సమాచారం లీక్ విషయంలో యూఎస్ రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రణాళికల పై చర్చించేందుకు వినియోగించిన సిగ్నల్ యాప్ పై విచారణ జరుపుతున్నట్లు పెంటగాన్ పేర్కొంది.
పెంటగాన్ క్రియాశీల ఇన్‌స్పెక్టర్ జనరల్ స్టెవెన్ స్టెబిన్స్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు.హెగ్సెత్ చాట్ కోసం వినియోగించిన సిగ్నల్ యాప్ రహస్య సమాచారం భద్రత,రక్షణశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందో, లేదో పరిశీలిస్తున్నట్లు తెలిపారు.అంతేకాక..అధికార సంభాషణల కోసం ఇటింటి కమర్షియల్ యాప్ ల వినియోగం శ్రేయస్కరమేనా అనేది తమ విచారణ లక్ష్యమని వెల్లడించారు.
Also Read: Arjun Son Of Vyjayanthi: కళ్యాణ్ రామ్ సమ్మర్ ట్రీట్.. అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఇదే
యెమెన్ లోని హుతీ రెబల్స్ కు బలమైన సంకేతాలు పంపాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిన తర్వాత..దాడులకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ క్రమంలో వీటిని పర్యవేక్షించేందుకు జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ సిగ్నల్ యాప్ లో రక్షణ మంత్రి పీట్ హేగ్సే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, డైరెక్టర్‌ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా 19 మందిని యాడ్ చేశారు.
ఈ క్రమంలో పొరబాటున అట్లాంటిక్ ఎడిటర్ జెఫ్రీ గోల్డ్‌బెర్గ్ కూడా యాడ్ అయిన వారిలో ఉన్నారు.ఈ గ్రూప్ లో మెసేజ్ లు వారం తర్వాత ఆటోమేటిక్ గా కనిపించకుండా పోయేటట్లు సెట్టింగ్స్ ను మార్చారు. ఇటీవల ఈ గ్రూప్ చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆ పత్రిక బహిర్గతం చేసింది.
వీటిల్లో యెమెన్ పై దాడులకు సంబంధించిన ప్లాన్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. యుద్ధ విమానాలు బయల్దేరిన దగ్గర నుంచి అవి దాడులు చేసేవరకు అప్‌డేట్లు పోస్టు అయ్యాయి.హెగ్సెత్ గ్రూప్ చాట్ లో టార్గెట్స్,అమెరికా ఆయుధాల మోహరింపు,దాడులు చేసే దిశ వంటి అంశాలపై చర్చించారు.ఆ విధంగానే దాడులు సైతం జరిగాయి. అయితే వాన్స్ గా గుర్తించిన వ్యక్తి ఈ దాడులను వ్యతిరేకించినట్లు వెల్లడైంది.
Also Read: Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!
america | yeman | latest-news | latest-telugu-news | latest telugu news updates | pentagon