Twitter : యుద్ధం పేరుతో ఫేక్ వీడియోలు.. ఎక్స్ సంచలన నిర్ణయం!

యుద్ధం పేరుతో ఫేక్ వీడియోలు సృష్టించి జనాలను తప్పుదోవ పట్టించే వారికి ఎక్స్ బిగ్ షాక్ ఇచ్చింది. యుద్ధం సమయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అందరికీ చాలా ముఖ్యం.

New Update
x

యుద్ధం పేరుతో ఫేక్ వీడియోలు సృష్టించి జనాలను తప్పుదోవ పట్టించే వారికి ఎక్స్ బిగ్ షాక్ ఇచ్చింది. యుద్ధం సమయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అందరికీ చాలా ముఖ్యం, కానీ ఈ మధ్య AI  వాడి అసలైన యుద్ధం కంటే భయంకరమైన నకిలీ వీడియోలను సృష్టించేస్తున్నారు. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి ఇలాంటివి మరీ ఎక్కువయ్యాయి. టెల్ అవీవ్‌పై క్షిపణుల వర్షం కురుస్తున్నట్టు ఉన్న ఒక ఫేక్ వీడియోను కోట్లాది మంది చూశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నికితా బీర్ సంచలన నిర్ణయం

ఈ క్రమంలో ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా సరే, యుద్ధానికి సంబంధించిన AI వీడియోలు పెట్టి.. అది AI ద్వారా తయారు చేసిందని ముందే చెప్పకపోతే, వారికి ఆ ప్లాట్‌ఫారమ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వెంటనే కట్ చేస్తారు. ఒకవేళ రెండోసారి కూడా అదే తప్పు చేస్తే, ఇక జీవితాంతం ఆ అకౌంట్‌తో పైసా సంపాదించకుండా పర్మనెంట్ బ్యాన్ విధిస్తారు. వినియోగదారులు ఇచ్చే కమ్యూనిటీ నోట్స్ ద్వారా లేదా సాంకేతిక గుర్తుల ద్వారా ఈ నకిలీ వీడియోలను పట్టుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల వంటి పెద్దలు కూడా పొరపాటున ఈ AI ఫోటోలను నిజమని నమ్మి షేర్ చేస్తున్నారంటే, ఈ నిబంధనలు ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది.

కేవలం వీడియోలకే ఈ నిబంధన వర్తిస్తుందని, AI ఫోటోలపై ప్రస్తుతానికి ఎలాంటి ఆంక్షలు లేవని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఇరాన్ యుద్ధం నేపథ్యంలో  ఎక్స్ లో భారీగా నకిలీ కంటెంట్ పెరిగిపోయింది. ముఖ్యంగా టెల్ అవీవ్‌పై క్షిపణి దాడులు జరిగినట్లుగా రూపొందించిన ఒక నకిలీ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించడం గమనార్హం. మరోవైపు అమెరికా దాడిలో ఓ స్కూల్‌లో సుమారు 150 మంది చిన్నారులు మృతిచెందిన‌ట్లు ఉన్న ఫేక్ ఫోటోను కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఎక్స్‌లో షేర్ చేశారు. చాలా మంది ఉన్న‌తాధికారులు కూడా ఫోటోను షేర్ చేశారు. అయితే అది ఫేక్ పిక్ అని, ఏఐ జ‌న‌రేటెడ్ కాంటెంట్ అని ఎక్స్ తేల్చింది.

Advertisment
తాజా కథనాలు