/rtv/media/media_files/2025/03/01/LBEe5SG7Um63QNHVDX7Y.jpg)
Trump vs Zelen
Trump Vs Zelen: అమెరికాలోని వైట్ హౌస్ లో రచ్చ రచ్చ అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య ఖనిజాల తవ్వకం ఒప్పందం కాస్తా పెద్ద గొడవగా మారింది. ఇరు దేశాధినేతలూ ఒకరిపై ఒకరు మండిపడ్డారు. శాంతి చర్చలు...అశాంతి చర్చలుగా మారాయి. దీంతో జెలెన్ స్కీ ఒవల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్ళిపోయారు. అమెరికాలో తన తదుపరి కార్యక్రమాలను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
అయితే ఈ మొత్తం వ్యవహారంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ట్రంప్, జేడీ వాన్స్ చేసిన పనిపై అమెరికా ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రాట్లు మండిపడుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ లానే వారు కూడా ప్రవర్తిస్తున్నారు అంటూ విమర్శించారు. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి అవ్వాల్సిందే అంటూ ట్రంప్ కు సపోర్ట్ గా నిలబడింది. జెలెన్ కు ఈ మాత్రం కోటింగ్ పడాల్సిందే అంటూ వ్యాఖ్యానించింది.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
జెలెన్ కు మద్దతుగా నాటో దేశాలు..
అయితే నాటో దేశాలు మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడి వైపే నిలిచాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ..ఉక్రేనియన్లను బాధితులుగా వర్ణించారు. మొదట నుంచి పోరాడుతున్న వారిని గౌరవించాలి అంటూ కామెంట్స్ చేశారు. అలాగే స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ కూడా ఉక్రెయిన్ కు సంఘీభావం తెలిపారు. స్పెయిన్ మీతో ఉంది అంటూ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇక నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్ ఉక్రెయిన్‌కు మద్దతుగా..న్యాయమైన మరియు శాశ్వత శాంతి కోసం ఉక్రెయిన్ పోరాటంలో మేము దానికి మద్దతుగా నిలుస్తాము అని చెప్పారు. ఉక్రెయిన్, నువ్వు ఎప్పటికీ ఒంటరిగా నడవలేవు అని లిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేడా హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ పౌరుల కంటే ఎవరూ శాంతిని ఎక్కువగా కోరుకోరు అంటూ జర్మనీ తన మద్దతుని తెలిపింది. ఆ దేశం జర్మనీ, యూరప్ లమీద ఆధారపడొచ్చని చెప్పింది.
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి
మరోవైపు నెదర్లాండ్స్ ఉక్రెయిన్‌కు గతంలో కంటే మరింత బలంగా మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఎప్పుడూ లేనంత ఎక్కువగా మీ వైపు నిలబడి పోరాడుతామని ఆ దేశ ప్రధాన మంత్రి డిక్ స్కూఫ్ అన్నారు. కానీ యూరప్ దేశమైన హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బన్ మాత్రం ట్రంప్ కు మద్దతునిచ్చారు. ఈ రోజు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధైర్యంగా శాంతి కోసం నిలబడ్డారు. చాలా మందికి దీన్ని జీర్ణించుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ధన్యవాదాలు, మిస్టర్ ప్రెసిడెంట్ అన్నారు.
Also Read: USA: జెలెన్ స్కీ పై విరుచుకుపడ్డ అమెరికా ఉపాధ్యక్షుడు