/rtv/media/media_files/2025/03/28/nJFlB9Fed3KWXpSBkhiH.jpg)
Earthquake in Myanmar and Thailand
మయన్మార్ భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు.వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా..వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.మూడు రోజుల అనంతరం సహాయక సిబ్బంది ఓ గర్భిణీని శిథిలాల కింద నుంచి సురక్షితంగా రక్షించారు.మాండలేలోని గ్రేట్ వాట్ హోటల్ శిథిలాల నుంచి ఆమెను బయటకు తీసినట్లు అధికారులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Also Read: Ap Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త..ఈ వారం అంతా వానలే వానలు..!
మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.మయన్మార్,థాయ్ లాండ్ ను శుక్రవారం రెండు భారీ భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1700 దాటింది.
Also Read: Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్ చీఫ్!
ఒక్క మయన్మార్ లోనే కనీసం 102 మంది మరణించినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారు. మరో 2370 మంది గాయపడినట్లు పేర్కొన్నారు.మరోవైపు శిథిలాల కింద చిక్కుకుపోయిన తమవారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో అనేక మంది తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇప్పటి వరకు బయటకు తీసిన వారిలో ఒక్కమహిళ తప్ప ఎవరూ ప్రాణాలతో లేరని అధికారులు పేర్కొన్నారు.
శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందన్నారు. మయన్మార్ లో శుక్రవారం మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి.ఈ ప్రభావంతో పొరుగునున్న థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోనూ తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో తీవ్ర ఆస్తి,ప్రాణ నష్టం సంభవించింది. ఈ దేశాలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి.
ఇప్పటికే భారత్..ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు,దుప్పట్లు,స్లీపింగ్ బ్యాగులు జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది.అటు అమెరికా,ఇండోనేషియా,చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి.ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియా -గుటెరస్ వెల్లడించారు.
Also Read:Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!
massive earthquake in myanmar | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates