/rtv/media/media_files/2026/02/04/niagara-water-falls-2026-02-04-12-47-24.jpg)
Why has Niagara Falls frozen ? Breathtaking ice cliffs take over
నయాగారా జలపాతం అంటే ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్త్ అమెరికాలో ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రపంచదేశాల నుంచి అనేక మంది టూరిస్టులు వస్తుంటారు. ప్రతిరోజూ అక్కడ పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు ఆ ప్రదేశం మంచుదుప్పటిని కప్పుకుంది. 2026 జనవరి నుంచి తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా అక్కడ అంతా మంచుమయంగా మారిపోయింది. అయినప్పటికీ పర్యాటకులు చలిని పట్టించుకోకుండా ఈ ప్రదేశానికి వస్తున్నారు.
Niagara Falls is Frozen! What a surreal experience on this beautiful winter day! #NYwx
— BuffaloSnowKing (@BuffaloSnowKing) February 3, 2026
Full Length 4K Cut on YouTube:https://t.co/lFUi5cDD1Mpic.twitter.com/AT9MxsI8pW
Also Read: మీరు నవ్వడం ఎప్పుడూ చూడలేదు.. మీరొక చెత్త రిపోర్టర్.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం..
అక్కడ గడ్డకట్టిన జలపాతాలు, మంచులో కూరుకుపోయిన వృక్షాలు, పొగమంచును చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జలపాతంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇది పూర్తిగా గట్టకట్టలేదు. కానీ అంచులు, వంతెనలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం భారీగా మంచు పెరుకుపోయింది. దీంతో మంచుతో నిండిన ఈ మనోహర దృశ్యాన్ని చూసేందుకు కూడా పర్యాటకులు తరలివస్తున్నారు.
Aerial view of Niagara Falls after a historic snowfall. The landscape looks like a winter wonderland.
— Science girl (@sciencegirl) February 2, 2026
pic.twitter.com/tge0NMuTEz
నయగరా జలపాతం గట్టకట్టడానికి కారణాలు
ఆర్కిటిక్ ప్రాంతం నుంచి బలమైన శీతల గాలులు వీస్తుండంటంతో నయాగరా జలపాతం పాక్షికంగా గట్టకట్టింది. ఉత్తర ధ్రువం వద్ద శీతల గాలిని బంధించి ఉంచే పోలార్ వోర్టెక్స్ వ్యవస్థలో అస్థిరత రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 2026 జనవరిలో వచ్చిన స్ట్రాటోస్పిరిక్ వార్మింగ్ వల్ల ఈ సుడిగుండం బలహీనపడింది. అలాగే ఉత్తర అమెరికా వైపు తీవ్రమైన చలి గాలులు వీచాయి. దీంతో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కన్నా దిగువకు పడిపోయింది. భారీ మంచు తుఫానుల వల్ల కూడా ఆ ప్రాంతమంతా మంచుగా మారిపోయింది. జలపాతాల నుంచి వచ్చే తుంపరలు కూడా ఈ చలికి గట్టకట్టి మంచుపొరలుగా ఏర్పడ్డాయి. ఈ శీతల ప్రభావం నార్త్ అమెరికాకే కాకుండా యూరప్, ఆసియా దేశాల్లో కూడా ఉంది.
Also Read: ఆశ్రమంలో అశ్లీల చిత్రాలు.. నలుగురు సన్యాసుల అరెస్ట్
Follow Us