/rtv/media/media_files/2025/12/07/pakistan-2025-12-07-08-57-19.jpg)
పాకిస్తాన్ లో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం పడిపోతుందా. నెమ్మదిగా అధికారాన్ని ఆర్మీ చేజిక్కుంచుకుంటుందా...పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తాజా పరిణామాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. ఏ దేశంలో అయినా ప్రధానకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఆయన చెప్పిందే ఆర్మీ చీఫ్ వినాలి. కానీ పాకిస్తాన్ లో ఆర్మీ ఎప్పుడూ ఈక్వల్ అధికారాలను కలిగి ఉంటుంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో దాని జోక్యం ఉంటూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అది రి కాస్త ఎక్కువైంది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రధాని షాబాజ్ షరీఫ్ చేతిలో కంటే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలోనే అధికారాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు.
ఆసిమ్ మునీర్ కు అపరిమిత అధికారాలు..
పాకిస్తాన్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన మార్పును తీసుకొచ్చింది. ఆర్మీ చీఫ్ కోసం ఆసిమ్ కోసం కొత్తగా ఓ పదవిని సైతం సృష్టించింది. ఇది అత్యంత శక్తివంతమైన సైనిక పదవి అయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎఫ్). దీనికి మొదటి సీడీఎఫ్ గా ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను నియమించింది. పాకిస్తాన్ దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను ఐదేళ్ల కాలానికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్)గా ఏకకాలంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా నియమిస్తూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ సీడీఎఫ్ పదవి పాక్ త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌పై అధికారాన్ని కల్పిస్తుంది. అంతేకాదు పాకిస్తాన్ అణ్వాయుధాలు, క్షిపణి వ్యవస్థలను నిర్వహించే నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ కూడా ఆసిమ్ మునీర్ చేతిలోనే ఉంటుంది.దాని వల్ల దేశ అణు ఆయుధాలు, మిసైల్ సిస్టమ్‌లను కంట్రోల్ చేసే శక్తిని కలిగి ఉంటారు. దీంతో మునీర్ పాకిస్తాన్ లోనే అత్యంత శక్తిమంతమైన సైనిక అధిపతిగా మారిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని కన్నా కూడా శక్తివంతమయ్యారు. ఈ హోదా పొందిన వారికి జీవితకాలం పాటు ఎలాంటి న్యాయపరమైన విచారణలు ఎదుర్కొకుండా మినహాయింపు లభిస్తుంది. ఆసిమ్ మునీర్ ఏం చేసినా అడిగే వారే ఎవరూ ఉండరు.
ముషరాఫ్ లానే అధికారాన్ని చేజిక్కించుకుంటారా?
గత కొంత కాలంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ లో కీలకంగా కనిపిస్తున్నారు. దాదాపు ప్రభుత్వ వ్యవహారాలు అన్నీ ఆయనే చూస్తున్నట్టు అనిపిస్తోంది. అమెరికా పర్యటనలు, ట్రంప్ తో మీటింగ్ లు అవీ కూడా మునీరే ఎక్కువ నిర్వహించారు. పహల్గాం దాడి తర్వాత భారత్ తో జరిగిన యుద్ధంలో కూడా ఆసిమ్ మునీర్ దే కీలక పాత్ర. వీటన్నిటికీ తోడు ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు అదనపు అధికారాలను కట్టబెట్టింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం మళ్ళీ ఆర్మీ చేతుల్లోకి వెళుతుందా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ప్రధాని షాబాజ్ ఫరీఫే స్వయంగా గవర్నమెంట్ ను అప్పగిస్తారేమో అని కూడా అంటున్నారు.
పాకిస్తాన్ చరిత్రలో ప్రభుత్వంలో సైన్యం జోక్యం కొత్తేమీ కాదు. 1947లో పాక్ విడిపోయిననప్పటి నుంచి.. పాకిస్తాన్ పౌర, సైనిక పాలన మధ్య అధికారం దోబూచులాడుతూనే ఉంది. 1999లో ఆర్మ చీఫ్ పర్వేజ్ ముషరాఫ్ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక రంగాలపై సైన్యం ప్రభావం బలంగా ఉంది. దీన్నే హైబ్రీడ్ పాలన అని కూడా అంటారు. ఇప్పుడు మళ్ళీ ముషరాఫ్ లానే ఆసిమ్ మునీర్ కూడా అవుతారా అంటూ మాట్లాడుకుంటున్నారు.
Follow Us