IRGC కొత్త కమాండర్‌గా ట్రంప్ బద్ధశత్రువు.. అహ్మద్ వాహిది ఎవరో తెలుసా ?

ఓవైపు ఇరాన్ మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి కొత్త కమాండర్‌గా అత్యంత అనుభవజ్ఞుడైన సైనిక వ్యూహకర్త అహ్మద్ వాహిదికి బాధ్యతలు అప్పగించింది.

New Update
IRGC’s new commander Ahmad Vahidi

IRGC’s new commander Ahmad Vahidi

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఇరాన్ మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి  కొత్త కమాండర్‌గా అత్యంత అనుభవజ్ఞుడైన సైనిక వ్యూహకర్త అహ్మద్ వాహిదికి బాధ్యతలు అప్పగించింది.  మార్చిన 1న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మాజీ చీఫ్ మొహమ్మద్ పక్పూర్ మృతి చెందడంతో ఆ పదవిలో వాహిదిని నియమించారు. ట్రంప్‌ బద్ధశత్రువైన ఇతడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1958లో ఇరాన్‌లోని షిరాజ్ నగరంలో అహ్మద్ వాహిది జన్మించారు. 1979లో అక్కడ ఇస్లామిక్ విప్లవం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వాహిది IRGCలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరాన్ రక్షణ వ్యవస్థలో ఆయన కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు.1980లలో నిఘా,  సైన్యంలో కీలక పదవులను నిర్వహించాడు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ఇరాన్‌కు చెందిన ఎలైట్ విభాగం ఖుద్స్ ఫోర్స్‌కు కూడా ఈయన మొదటి కమాండర్‌గా (1988-1997 వరకు) ఉన్నారు. 

Also Read: డిజిటల్ జనాభా లెక్కలు.. సెన్సస్-2027 షెడ్యూల్ విడుదల

1994లో అర్జెంటీనాలో ఓ యూదు కేంద్రంపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో వాహిది ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇంటర్‌పోల్‌ ఆయనపై రెడ్‌ కార్నర్ నోటీసులు జారీ చేసింది. అప్పటినుంచి వాహిది అంతర్జాతీయంగా మోస్ట్‌ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. మరో విషయం ఏంటంటే వాహిది ఓ కరుడుగట్టిన ఇస్లాం సిద్ధాంతకర్త.  అమెరికాను మొదటినుంచే ఈయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇరాన్‌పై ట్రంప్‌ విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ, తమ దేశంలోని మిస్సైల్స్ వ్యవస్థను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో కూడా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలని ఈయన ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

అహ్మద్ వాహిదీ సైనికాధికారి మత్రమే కాదు. గతంలో ఈయన ఇరాన్ రక్షణ మంత్రిగా, హోం మంత్రిగా కూడా పనిచేశారు. వాహిదికి సైనిక, రాజకీయ రంగాల్లో మంచి పట్టు ఉంది. అందుకే ఈ సంక్షోభ సమయంలో దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఇరాన్‌ ఈయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. శుక్రవారం వాహిది ఓ సంచలన ప్రకటన చేశారు. అమెరికా తమ దాడులు ఆపకపోతే మిడిల్‌ఈస్ట్‌ మొత్తం మంటల్లో చిక్కుకుంటుందని హెచ్చరించారు. ఈయన నేతృత్వంలో ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులను మరింత ఉద్ధృతం చేస్తోంది. 

Also Read: ఇరాన్ Vs అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం.. ఇప్పటిదాక జరిగిన ప్రధాన సంఘటనలు ఇవే

Advertisment
తాజా కథనాలు