US-Iran: చర్చలు జరుగుతుండగా నెతన్యాహు ఫోన్ చేసి చెడగొట్టాడు.. ఇరాన్ సంచలన ఆరోపణలు

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో నెతన్యాహు ఫోన్ చేయడం వల్ల ప్రతిష్టంభన ఏర్పడినట్లు ఇరాన్ ఆరోపిస్తోంది.

New Update
While US-Iran Talked Peace In Pakistan, Netanyahu Phone Call Changed Everything

While US-Iran Talked Peace In Pakistan, Netanyahu Phone Call Changed Everything

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌కు ఫోన్ చేసినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘీ ఆరోపించారు. ఆయన ఫోన్ చేయడం వల్లే చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ చర్చల్లో అమెరికా.. ఇరాన్ ప్రయోజనాల నుంచి ఇజ్రాయెల్ ప్రయోజనాల వైపు మళ్లించినట్లు మండిపడ్డారు. ఎక్స్‌ వేదికగా సయ్యద్ అబ్బాస్ ఈ విషయాన్ని పంచుకున్నారు. 

Also read: మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం.. అమెరికా, ఇరాన్‌లకు రష్యా ఆఫర్..

మరోవైపు దాదాపు 21 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో అమెరికా తీసుకొచ్చిన రూల్స్ ఆమోదయోగ్యంగా లేవని ఇరాన్ పేర్కొంది. హార్ముజ్ జలసంధిలో తమ నౌకలకు స్వేచ్ఛా ప్రయాణం, ఇరాన్ తన యురేనియం కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడం, ఇప్పటికే నిల్వ ఉన్న యురేనియంను అప్పగించాలని అమెరికా పట్టుబడుతున్నట్లు తెలిపింది. అయితే దీన్ని అమెరికా తమ చివరి ప్రతిపాదనగా పేర్కొంది. కానీ ఇరాన్ మాత్రం ఈ నిబంధనలు తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ తిరస్కరించింది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందం మరో తొమ్మిది రోజుల్లో ముగియనుంది. మరోవైపు చర్చలు విఫలమయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అనేదానిపై ఆందోళన నెలకొంది. 

ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమవ్వడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తోంది. గతంలో చమురు ధరలు బ్యారెల్‌కు 119 డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పడు కాల్పుల విరమణ అమల్లో ఉండటంతో 95 డాలర్లకు తగ్గింది. కానీ చర్చల వైఫల్యం వల్ల చమురు ధరలు మళ్లీ 100 డాలర్ల మార్కును దాటే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్లను మోహరించడం, అలాగే నౌకల నుంచి భారీగా రుసుము వసూలు చేస్తుండటం వల్ల ఇప్పటికే వాణిజ్య రవాణాపై అంతరాయం కొనసాగుతోంది.

Also Read: 21 గంటలు.. పాక్‌లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని JD వాన్స్.. ఎందుకో తెలిస్తే షాక్!

ఇదిలాఉండాగా ఈ దౌత్యపరమైన సంక్షోభం అమెరికా కూటమిలో చీలికలను బయటపెట్టింది. ఇరాన్‌పై సైనిక చర్యల కోసం తమ భూభాగాన్ని లేదా గగనతలాన్ని అమెరికా వినియోగించుకునేందుకు స్పెయిన్, ఇటలీ లాంటి దేశాలు నిరాకరించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేసినా కూడా.. పలు నాటో దేశాలు, గల్ఫ్ దేశాలు ఈ యుద్ధంలో భాగస్వామ్యం అయ్యేందుకు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ఇరాన్ విషయంలో కూడా అమెరికా అంతర్జాతీయంగా ఒంటరి అవుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు