ఖతార్‌లోని రాస్‌ లఫాన్‌పై ఇరాన్ దాడులు.. భారత్‌కు సవాళ్లు.. అసలేంటి రాస్‌ లఫాన్‌ ?

ఖతార్‌లోని రాస్‌ లఫాన్ నగరం ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఎంతో కీలకమైనంది. గత 20 ఏళ్లలో ఈ ప్రాంతం లిక్విఫైడ్‌ నేచురల్ గ్యాస్‌ ఇండస్ట్రీకి హబ్‌గా మారింది. ఇటీవల ఇరాన్‌ ఇక్కడ దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లు పతనమయ్యాయి.

New Update
What is Qatar’s Ras Laffan? World’s largest liquefied natural gas plant struck by Iran

What is Qatar’s Ras Laffan? World’s largest liquefied natural gas plant struck by Iran

ఖతార్‌లోని రాస్‌ లఫాన్ నగరం ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఎంతో కీలకమైనంది. గత 20 ఏళ్లలో ఈ ప్రాంతం లిక్విఫైడ్‌ నేచురల్ గ్యాస్‌ ఇండస్ట్రీకి హబ్‌గా మారింది. తాజాగా ఇరాన్‌ ఇక్కడ దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లు పతనమయ్యాయి. ఖతార్ రాజధాని దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో అరేబియా తీరంలోని రాస్‌ లఫాన్‌ సిటీ ఉంది. ఆసియా, యూరప్‌కు ఎగుమతులు చేసేందుకు ఇది ఎంతో అనుకూల ప్రదేశం. మొదట్లో ఇక్కడ ముత్యాలను సేకరించడం, చేపలను వేటాడం లాంటి పనులు చేసుకుంటూ ప్రజలు బ్రతికేవారు.   

ఖతార్ వైపు నార్త్‌ ఫీల్డ్‌

1971లో ఖతార్‌.. నార్త్‌ ఫీల్డ్‌ నాన్ అసోసియేటెడ్ గ్యాస్ క్షేత్రాన్ని గుర్తించింది. ఇక్కడ చమురు నిల్వలు తక్కువగా ఉంటే గ్యాస్ నిల్వలు మాత్రం ఎక్కువగా ఉండేవి. ఇరాన్‌తో కలిసి ఖతార్ దీన్ని పంచుకుంది. ఖతార్‌ వైపు ఉన్నదాన్ని నార్త్‌ ఫీల్డ్‌గా.. ఇరాన్ వైపు ఉన్నదాన్ని సౌత్‌ ఫార్స్‌ అని అంటారు. ముందుగా ఇక్కడ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LPG) గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. అయితే ఇరాన్‌ వైపు ఉన్న సౌత్ ఫార్స్ క్షేత్రాన్ని పేల్చేస్తాంటూ ఇటీవల ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.  

తాము గుర్తించిన ఈ గ్యాస్‌తో దేశ ఆర్థిక పరిస్థితిని మార్చుకోవచ్చని 1980ల్లోనే ఖతార్ పాలకులు గుర్తించారు. ఇందుకోసం వ్యూహాత్మక ప్లాన్ వేశారు. ముడి గ్యాస్‌ను విక్రయిస్తే అంతగా ఆర్థిక ప్రయోజనం రాదని.. దీన్ని ప్రాసెస్ చేసి LNGగా మార్చి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో LNG భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేదు. అయినప్పటికీ అక్కడ పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు.  దీనికోసం భారీ నౌకలు ఆగేందుకు అనువుగా ఉండేలా లోతైన సముద్రతీరమైన రాస్‌ లఫాన్ సిటీని ఎంపిక చేశారు. ఇందుకోసం ఖతార్ ఎనర్జీ శాఖ చొరవతో రెండు జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత డజన్ల కొద్దీ LNG ట్రెయిన్లను నిర్మించారు. 

Also Read: అమెరికాకు బిగ్ షాక్.. విదేశాల నుంచి దిగుమతులు.. స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు

ఏటా 77 మిలియన్ టన్నుల ఉత్పత్తి 

అంతేకాదు భారీ స్టోరేజీ ట్యాంకులు, ఎక్స్‌పోర్టు టెర్మినళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ పోర్టు వద్ద ప్రపంచంలో అతిపెద్ద LNG క్యారియర్లను నిలపవచ్చు. 1996లో మొదటిసారిగా LNG షిప్‌మెంట్ ఇక్కడి నుంచి జపాన్‌కు వెళ్లడంతో రాస్ లఫాన్ నగరం బయటపడింది. 2000 నాటికి ఇది ఖతార్‌కు కీలకంగా మారింది. 2010కి ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ ప్రతీ సంవత్సరం 77 మిలియన్ టన్నుల మేర LNG ఉత్పత్తి అవుతోంది. 

రాస్ లఫాన్ నుంచి గ్యాస్‌ను దాదాపు 30 దేశాలకు పైగా ఎగుమతి చేస్తారు. ఇందులో జపాన్, సౌత్ కొరియా, భారత్, యూరోపియన్ యూనియన్, చైనా లాంటి దేశాలు ఉన్నాయి. ప్రపంచ ఎల్‌ఎన్‌జి సరఫరాలో దాదాపు 20 శాతం ఇక్కడి నుంచే రవాణా అవుతోంది. ఖతార్ గ్యాస్‌తో 1999లో పెట్రోనెట్ LNG సంస్థ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటినుంచి ఇది గ్యాస్‌ను దిగమతి చేసుకుంటుంది.  

Also Read: యుద్ధం ఆగడం కష్టమే.. పశ్చిమాసియాకు వెళ్తున్న వేలాది యూఎస్ బలగాలు

భారత LNG దిగుమతుల్లో ఖతార్‌ నుంచే ఏకంగా 40 నుంచి 47 శాతం హర్ముజ్ జలసంధిని దాటుకొని వస్తున్నాయి. 2024లో భారత్-ఖతార్ మధ్య 78 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం చూసుకుంటే 2028 నుంచి 20 సంవత్సరాల పాటు మనకు ఏటా 7.5 మిలియన్ టన్నుల LNGని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఖతార్ నుంచి వచ్చే LNG అనేది భారత్‌లో విద్యుత్, ఎరువుల ఉత్పత్తి, పరిశ్రమలు, గృహోపయోగానికి ఎంతో కీలకంగా ఉంది. అమెరికా, ఆఫ్రికా కన్నా.. ఖతార్‌ నుంచి భారత్‌కు గ్యాస్ తరలించడమే చాలా చౌకగా ఉంటుంది. రాస్‌ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ గ్యాస్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలివేశారు. దీనివల్ల భారత్‌లో LNG కొరత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు