West Asia Conflict: యుద్ధ ప్రభావం .. భారత్ లో 25 లక్షల మంది పేదరికంలోకి

పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం భారత్‌పై తీవ్రంగా ఎఫెక్ట్‌ చూపించనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.

New Update
West Asia conflict, India faces 2.5 million poverty risk, United Nations warns

West Asia conflict, India faces 2.5 million poverty risk, United Nations warns

పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం కొనసాగుతున్న క్రమంలో చమురు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వివిధ దేశాల్లో నిత్యావసర సరకుల ధరలు కూడా మండిపోతున్నాయి. అయితే ఈ సంక్షోభం భారత్‌పై తీవ్రంగా ఎఫెక్ట్‌ చూపించనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది. పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలు, ఆసియా, పసిఫిక్‌లో మానవ అభివృద్ధిపై ప్రభావాలు అనే పేరుతో UN డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ ఓ రిపోర్టును విడుదల చేసింది.  

Also Read: చర్చలు విఫలం.. హోటల్ బిల్లు ఎగ్గొట్టి...ఇజ్జత్‌ తీసుకున్నపాక్‌

ఈ రిపోర్టు ప్రకారం.. ఈ యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ముప్పు ఉందని అంచనా వేసింది. చైనాలో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. పెరిగిన ఇంధన ధరలు, రవాణా,ముడిసరకుల ఖర్చులు కుటుంబ కొనుగోలు శక్తిని దెబ్బతీస్తాయని వెల్లడించింది. అలాగే ఆహార సంబంధిత సమస్యలు పెరుగుతాయని, ప్రభుత్వ బడ్జెట్లపై భారం పడుతుందని హెచ్చరించింది. 

Also Read: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్‌బెడ్‌లు..వీటి సామర్థ్యం, సాంకేతిక విశేషాలు ఏంటంటే?

మరోవైపు భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు అనేక దేశాల్లో ఆహార భద్రత ఒత్తిళ్లు పెరుగుతాయని యూఎన్ నివేదిక తెలిపింది. ఈ యుద్ధం ఇలాగే సుదీర్ఘ కాలం కొనసాగితే భారత్‌లో యూరియా నిల్వలు కూడా తగ్గిపోతాయని హెచ్చరించింది. ఇది రైతులపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు హర్మూజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల భారత్‌లో వైద్య పరికరాలకు సంబంధించిన ముడిపదార్థాల ధరలు దాదాపు 50 శాతం పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ఔషధాల టోకు ధరలు ఇప్పటికే 10 నుంచి 15 శాతం పెరిగిపోయినట్లు పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు