NASA: క్రూ-9 సిబ్బందికి అభినందనలు..స్పేస్ ఎక్స్ పాత్ర అద్భుతం-నాసా

స్పేస్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన నలుగురు ఆస్ట్రోనాట్స్ కు నాసా స్వాగతం పలికింది.  విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని వచ్చినందుకు  క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ మొత్తం దానిలో స్పేస్ ఎక్స్ పాత్ర అధ్భుతమని నాసా కొనియాడింది. 

New Update
అంతరిక్ష సంస్థలను ఎప్పుడు స్ధాపించారో తెలుసా..?

NASA

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తో పాటూ బుచ్ విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు ఐఎన్ఎస్ నుంచి ఈరోజు సురక్షితంగా తిరిగి వచ్చారు. ఈరోజు సాయంత్రం అమెరికాలోని పసిఫిక్ టైమ్ ప్రకారం ఏడు గంటలకు వారిని క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకుని వచ్చారు. ఆ తరువాత వ్యోమగాములను నాసా ప్రత్యేక విమానంలో వైద్యం కోసం హ్యూస్టన్ కు పంపించారు. ఆ తరువాత కొద్దిసేపటికి నాసా ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు.

ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

స్పేస్ ఎక్స్ ది అద్భుత పాత్ర..

ఆస్ట్రోనాట్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ లో దాదాపు 17 గంటలు ప్రయాణించారు. ఈ మొత్తం జర్నీలో స్పేస్‌ ఎక్స్‌ది అద్భుత పాత్ర అని కొనియాడింది నాసా. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు కలిస్తే అత్యంత శక్తివంతమవుతుంది అనడానికి ఉదాహరణగా..నాసా, స్పేస్ ఎక్స్ భాగస్వామ్యం ప్రూవ్ చేసిందని అన్నారు. క్యాప్సూల్ ఈరోజు భూమిని చేరే సమయంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉందని..అందుకే ల్యాండింగ్ కు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదని తెలిపింది. అలాగే ల్యాండింగ్ కోసం అమెరికా కోస్ట్ గార్డ్ అన్ని చర్యలు బాగా తీసుకుందని చెప్పింది. అన్‌డాకింగ్‌ నుంచి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ వరకు అన్నీ అనుకున్నట్లుగా జరిగాయి. ఆస్ట్రోనాట్స్ ఒక స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్ళారు మరోక దానిలో తిరిగి వచ్చారు అని నాసా తెలిపింది. వచ్చారు.  ఈ యాత్రలో సునీతా విలియమ్స్‌ రెండుసార్లు స్పేస్‌ వాక్‌ చేశారని నాసా ఉన్నతాధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

Also Read: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు