Big Breaking:లలిత్ మోడీకి బిగ్ షాక్ ..పాస్‌ పోర్టు రద్దు!

పరారీలో ఉన్న వ్యాపారవేత్త లలిత్ మోడీ వనాటు పౌరసత్వం రద్దు చేయబడింది. వనాటు ప్రధాని జోథమ్ నాపట్ అతని పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు.

New Update
IPl

Lalith Modi

భారతదేశంలో  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు తీసుకుని కుచ్చు టోపీ  పెట్టి విదేశాలకు పారిపోయిన వారిలో లలిత్ మోడీ కూడా ఒకరు. భారత్‌ నుంచి తప్పించుకోవడానికి పారిపోయిన వ్యాపారవేత్త లలిత్ మోడీ వనువాటు పౌరసత్వాన్ని కూడా కొద్ది రోజుల క్రితం పొందారు. కానీ ఇప్పుడు ఆయనకు ఊహించని విధంగా షాక్ తగిలింది. లలిత్ మోడీకి జారీ చేసిన వనువాటు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని వనువాటు ప్రధాన మంత్రి జోథమ్ నపట్ సోమవారం పౌరసత్వ కమిషన్‌ కు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: PM Modi: ఇది అసాధారణ మ్యాచ్‌..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు!

లలిత్ మోడీ సిటిజన్‌షిప్ రద్దు చేస్తున్నట్లుగా వనువాటు దినపత్రిక వనువాటు డైలీ పోస్ట్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది. నివేదిక ప్రకారం ఇదంతా భారతదేశం ఒత్తిడి చేయడం వల్లే జరిగినట్లుగా సమాచారం అందుతుంది. లలిత్ మోడీ పాస్‌పోర్ట్ రద్దు చేయడంలో న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్ కీలక పాత్ర పోషించారని టాక్ వినపడుతుంది.

Also Read: Weather alert: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాలో ప్రజలు జాగ్రత్త

పారిపోయిన భారతీయ వ్యాపారవేత్త...

అయితే లలిత్ మోడీకి ఎందుకు సిటిజన్‌షిప్ ఇచ్చిందో.. ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనే దానిపై స్పష్టత కూడా అందించింది వనువాటు డైలీ. 'అంతర్జాతీయ మీడియాలో ఇటీవల వెల్లడైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వనువాటు డైలీ పోస్ట్ రాసుకొచ్చింది. మరింత సమాచారం అతిత్వరలోనే తమ వార్తాపత్రికలో అందిస్తామని పేర్కొంది. అయితే లలిత్ మోడీ పారిపోయిన భారతీయ వ్యాపారవేత్త అని వనువాటుకు తరువాత తెలిసిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని నమ్ముతారు.

భారతదేశంలో వేల కోట్లలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చెల్లించని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు లలిత్ మోడీ. ఆయనతో పాటు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి పేరు మోసిన వ్యాపారవేత్తలు ఈ జాబితాలో ఉన్నారు. దేశ సంపద లూటీ చేసి పరాయి దేశాల్లో హాయిగా జీవిస్తున్న వాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదని విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే విమర్శలు చేయడంలో కేంద్రం ఈ దిశగా చర్యలు చేపట్టింది.

Also Read: Kohli: ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!

Also Read: Mark-carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

New Update
7.1 earthquake hits Tonga in South Pacific

Earthquake

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

 

 

 

Advertisment
Advertisment
Advertisment