/rtv/media/media_files/2024/11/25/wsowajpng1RG5lCsUga2.jpg)
రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఒక వైపు కీలక భేటీలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీవ్ పై మాస్కో (Mascow) వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి.
కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యా తమ పై బాలిస్టిక్ క్షిపణులు,బహుళ రాకెట్లను ప్రయోగించిందని కీచ్‌కోస్ తెలిపారు.వీటిని తమ దళాలు అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. కీవ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తమకు పేలుడు శబ్ధాలు వినిపిస్తున్నాయని అక్కడి ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!
Ussian Airstrikes On Ukraine
యుద్ధం ముగింపునకు సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులు కీలక చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో రష్యా దాడులు చేయడం గమనార్హం.ఇటీవల సైతం ఉక్రెయిన్ లోని డోబ్రోపిలియా, ఖార్కివ్ ప్రాంతాల్లోని స్థావరాల పై రష్యా క్షిపణి, డ్రోన్ లతో విరుచుకుపడింది.ఈ దాడిలో 14 మంది మరణించగా..అనేక మంది గాయపడ్డారు.
ఎనిమిది బహుళ అంతస్తుల భవనాలు, 30 కు పైగా వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. రష్యా దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు తమ వైమానిక రక్షణను బలోపేతం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఇక రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అటు అమెరికా,ఇటు ఐరోపా దళాలు కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి. యద్ధాన్ని ముగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సౌదీ అరేబియాలో ఉక్రెయిన్ తో అమెరికా చర్చలకు సిద్ధమైంది. అమెరికా సాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ కు అండగా నిలిచేందుకు మాస్కోను నిలువరించేందుకు ఐరోపా దేశాలు సమావేశమవుతున్నాయి.
Also Read:Rains: మండుతున్న ఎండల్లో వాతావరణశాఖ చల్లటి వార్త.. 3 రోజులపాటు వానలే..వానలు!
Also Read: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!