/rtv/media/media_files/2025/03/23/eW8elNZkxR6PebrT43UO.jpg)
USA Attacks Yemen
ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్ ల మధ్య యుద్ధం ఇప్పుడు అమెరికాకు కూడా పాకింది. కొన్ని నెలలుగా యెమెన్ కు చెందిన హౌతీలు అమెరికాపై దాడులు చేస్తున్నారు. దీనికి ప్రతిగా ఇప్పుడు అగ్రరాజ్యం కూడా దాడులను మొదలుపెట్టింది. తాజాగా అమెరికా హౌతీలపై మరోసారి విరుచుకుపడింది. యెమెన్ లోని ముఖ్య నగరాలైన హోడెదా, మారిబ్, సాదాలపై అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. అక్కడి ఎయర్ పోర్ట్, ఓడరేవుల లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. దీని వలన భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. హౌతీలపై ట్రంప్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది.
ఇంతకు ముందు కూడా..
అంతకు ముందు ఇదే నెలలో కొన్ని రోజుల క్రితం కూడా అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం యెమెన్‌లో ఉన్న హౌతీలను లక్ష్యంగా చేసుకొని సైనిక చర్యకు దిగింది. యెమెన్ రాజధాని అయిన సనాతో పాటు సదా, అల్ బైదా, రాడాలే ప్రాంతాలపై దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 31 మందికి పైగా మృతి చెందారు. మరో 101 మంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని హౌతీ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు అమెరికా నౌకలు, విమానాలపై హౌతీలు దాడులు చేస్తే సహించేది లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ తేల్చిచెప్పింది. అయితే అమెరికా చేసిన దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. దీన్ని యుద్ధ నేరంగా అభివర్ణించింది. అంతేకాదు యెమెన్ దళాలు అమెరికాతో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ వార్నింగ్ ఇచ్చింది.
today-latest-news-in-telugu | usa | yemen | attacks