Pakistan-America: శత్రు దేశంతో దోస్తీ.. పాక్ వైఖరిపై అమెరికా సెనెటర్ నిప్పులు!

అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరించడంపై అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వైఖరి వల్ల శాంతి ప్రక్రియకు విఘాతం కలుగుతోందని ఆయన ఆరోపించారు.

New Update
FotoJet (9)

అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరించడంపై అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వైఖరి వల్ల శాంతి ప్రక్రియకు విఘాతం కలుగుతోందని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ ఇజ్రాయెల్‌ను శత్రువుగా చూడటం, ఇరాన్‌తో సన్నిహితంగా ఉండటం అమెరికాకు ఆందోళన కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు. అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపును పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తిరస్కరించడంపై లిండ్సే మండిపడ్డారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకోవడానికి పాకిస్తాన్ నిరాకరించడం, ఆ దేశంపై పాక్ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావన్నారు. ఇజ్రాయెల్‌ను ద్వేషించే దేశం, శాంతిని ఎలా నెలకొల్పుతుందని ప్రశ్నించారు.

ఇది కూడా చూడండి: Fighter Jets : కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేటు సంస్థలకు ఫైటర్ జెట్ల తయారీ ఛాన్స్

ఇది కూడా చూడండి: Namitha: ట్రోలర్స్‌కు నమిత స్ట్రాంగ్ వార్నింగ్! అసలేమైందంటే..?

పాకిస్తాన్ వల్ల భద్రతకు ముప్పు..

ఈ విషయంలో పాకిస్తాన్ స్పష్టమైన సమాధానం చెప్పాలని లిండ్సే గ్రాహం డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌ను గుర్తించని దేశంతో చర్చలు జరపడం అమెరికాకు సవాలుగా మారిందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ తీరు వల్ల ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన సైనిక విమానాలను పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లలో పార్క్ చేసిందనే వార్తలను కూడా లిండ్సే ప్రస్తావించారు. ఈ ఆరోపణలను తేలికగా కొట్టిపారేయలేమని, దీనిపై సమగ్ర విచారణ జరగాలన్నారు. ఒకవేళ ఇరాన్ విమానాలు పాక్ గడ్డపై ఉంటే.. అది అమెరికా వ్యతిరేక చర్యేనని అన్నారు. పాకిస్తాన్ తక్షణమే తన విదేశాంగ విధానంపై స్పష్టత ఇవ్వాలని లిండ్సే కోరారు.

ఇది కూడా చూడండి: Disha Mouni: దిశా-మౌనీ లెస్బియన్ రూమర్స్‌ పై మరో ట్విస్ట్… పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు?

ఇది కూడా చూడండి: Tamil Nadu CM Vijay : ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్..ఢిల్లీలో బిజీబిజీ

Advertisment
తాజా కథనాలు