/rtv/media/media_files/2025/03/26/RnHBm6DkW7syQm4x7PEr.jpg)
jay
అమెరికాలో భారత సంతతి వ్యక్తులు ఉన్నత హోదాలు అందుకుంటున్నారు. ఇదే కోవలో జయ్ భట్టాచార్య కు వైధ్యరంగానికి చెందిన ఉన్నత పదవి దక్కింది.నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా భట్టాచార్య ఎన్నికైనట్లు యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది.వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు తదుపరి డైరెక్టర్ గా భారతీయ మూలాలు ఉన్న జయ్ భట్టాచార్య ను నియమిస్తున్నట్లు నవంబర్ లో ట్రంప్ ప్రకటన విడుదల చేశారు.
భట్టాచార్యను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా నియమించడం నాకు చాలా ఆనందంగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ సహకారంతో భట్టాచార్య ఎన్‌ఐహెచ్ ను నడిపించడంతో పాటు దేశ ప్రజల ప్రాణాలను కాపాడే ముఖ్యమైన ఆవిష్కరణలు చేసేందుకు పని చేస్తారు. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు వారిద్దరూ కలిసి కృషి చేస్తారని పేర్కొన్నారు.
Also Read: Sajjanar: ఉన్నది ఒక్కటే జీవితం అంటూ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్
ట్రంప్ ప్రకటన పై జయ్ ఆనందం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ నన్ను తదుపరి ఎన్‌ఐహెచ్ డైరెక్టర్ గా నియమించారు.మేము అమెరికన్ శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మారుస్తామని వెల్లండిచారు.ఈ నేపథ్యంలోనే యూఎస్ సెనెట్ ఆమోదం లభించింది.
జయ్ భట్టాచార్య కోల్ కతాలో పుట్టారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో డాక్టరేట్ అందుకున్నారు. రాజకీయ కుటుంబ వారసుడిగా,న్యాయవాదిగా ఆయన అందరికీ పరిచయమే.కొవిడ్ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్ లో మీడియాకి వదంతుల పండగ..యూనస్ సంచలన వ్యాఖ్యలు
Also Read: America Elections: అమెరికా ఎన్నికల్లో భారీ మార్పలు..చేర్పులు!
america | jay bhattacharya | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates