US Sailors: అమెరికా సైనికులకు ఆహార కొరత.. సరైన తిండి లేక అవస్థలు

గత కొన్ని వారాలుగా విధుల్లో ఉన్న అమెరికా సైనికులు ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సైనికులకు వడ్డిస్తున్న ఆహారం ఫొటోలు వారి కుటుంబ సభ్యులకు పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

New Update
US sailors share photos of grim meals aboard warships

US sailors share photos of grim meals aboard warships

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా వేలాది మంది తమ సైనికులను పశ్చిమాసియాకు తరలించింది. అయితే గత కొన్ని వారాలుగా విధుల్లో ఉన్నవారు ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సైనికులకు వడ్డిస్తున్న ఆహారం ఫొటోలు వారి కుటుంబ సభ్యులకు పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

గత కొన్ని వారాలుగా యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకల్లో సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. మిలిటరీ జిప్‌కోడ్స్‌కు అంటే విదేశాల్లో ఉండే సైనిక, దౌత్య కార్యాలయాకు పంపే పోస్టల్ సేవలు కూడా నిలిచిపోయాయి. దీనివల్ల అమెరికాలోని కుటుంబాలు విధుల్లో ఉన్న తమవాళ్లకు ఆహారం, ఇతర ఉత్పత్తులు పంపించే వీలు లేకుండా పోయింది. 

Also read: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. మరో బాంబు పేల్చిన ట్రంప్

అయితే USS ట్రిపోలిలో ఉన్న ఆహారాన్ని రేషన్ పద్ధతిలో వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ మెరైనర్ తన తండ్రికి తాజా సరకులు లేవనే విషయాన్ని చెప్పారు. తన బిడ్డ కోసం కొన్ని స్నాక్స్, షాంపూ, టూత్‌పేస్ట్‌ పంపామని కానీ అవి ఇంతవరకు చేరలేవని ఆ తండ్రి చెప్పారు. మరో సెయిలర్‌ తన తల్లితో మాట్లాడుతూ సరకులు చాలా తక్కువగా ఉన్నాయంటూ వాపోయారు. ఆ కుటుంబం పంపిన ఆహారం కూడా అతడున్న చోటుకి వెళ్లలేదు. యుద్ధం వల్ల గగనతల మూసివేతలు, రవాణా సమస్యల వల్ల ఏప్రిల్ నుంచే డెలివరీలు ఆగిపోయాయని అమెరికా ఆర్మీ ప్రతినిధి తెలిపారు. 

యూఎస్‌ఎస్‌ ట్రిపోలి 3500 మంది మెరైన్లతో మార్చి 27న ఇరాన్‌కు దగ్గరగా వెళ్లింది. జనవరి చివర్లోనే యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్ అక్కడికి చేరింది. అప్పటినుంచే ఈ యుద్ధ నౌకల్లో నాణ్యమైన ఆహారం లభించడంలేదని వార్త కథానాలు వెల్లడించాయి. ఇందులో విధుల్లో నిర్వహిస్తున్నవారు ఎప్పుడూ ఆకలితోనే ఉంటున్నట్లు పేర్కొన్నాయి. 

Also Read: హర్మూజ్‌ను మళ్లీ మూసేస్తాం.. ఇరాన్‌ సంచలన వార్నింగ్‌

మరోవైపు విమాన వాహక నౌక జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లోని ప్రధాన లాండ్రీ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీనివల్ల పలు కంపార్ట్‌మెంట్లలో ఉన్న అమెరికన్ సైనికులు, నావీ సిబ్బంది విష వాయువు పీల్చి అస్వస్థతతో ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ నౌకలో విధులు నిర్వహిస్తున్న 4500 మంది సిబ్బంది టాయిలెట్‌ కష్టాలు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల  సైనికులకు కూడా కష్టాలు ఎదురవుతున్నాయి.  

Advertisment
తాజా కథనాలు