/rtv/media/media_files/2025/02/16/KFfyCg9hwDFPrLkpstfw.jpg)
Zelenskyy
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై యుద్ధం చేసేందుకు అమెరికా తమకు 100 బిలియన్ డాలర్లు మాత్రమే సాయం అందించిందని పేర్కొన్నారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ఇలా స్పందించారు. ఈ యుద్ధంలో ఆయుధాల కోసం ఇప్పటిదాకా 320 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. ఇందులో 120 బిలియన్ డాలర్లు ప్రజల నుంచే సేకరించామని, మరో 200 బిలియన్ డాలర్లు ఐరోపా సమాఖ్య, అమెరికా ఇచ్చినట్లు జెలెన్‌స్కీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
Also Read: ట్రంప్ ప్రభుత్వంపై నిరసన సెగలు.. రోడ్లపైకి వస్తున్న జనాలు
అమెరికా నుంచి 67 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, 31.5 బిలియన్ డాలర్ల బడ్జెట్ సపోర్ట్ మాత్రమే అందింది. ఎవరైనా దాన్ని 500 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి.. అంతమొత్తం ఖనిజ సంపద ఇవ్వాలని అడగకూడదు'' అని జెలెన్‌స్కీ అన్నారు. ఇదిలాఉండగా.. ఉక్రెయిన్‌కు రష్యాతో యుద్ధం చేసేందుకు మద్దతు ఇవ్వాలంటే ఇందుకు బదులుగా 500 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజాలను తమకు ఇవ్వాలని ట్రంప్ ఇలా ఆఫర్ ఇస్తున్నారు. ఈ డీల్ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు చాలా సందర్భాల్లో ఉక్రెయిన్‌కు సాయం చేశామని.. ఓసారి ఏకంగా 350 బిలియన్ డాలర్లు ఇచ్చినట్లు తెలిపారు.
Also Read: గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారు..మెయిల్ చేయాలన్న మస్క్!
ఈ క్రమంలోనే ట్రంప్‌కు కౌంటర్‌కు జెలెన్‌స్కీ స్పందించారు. తమకు అమెరికా 100 బిలియన్ డాలర్లు మాత్రమే సాయం చేసిందని స్పష్టం చేశారు. అంతేకాదు ట్రంప్ ఆఫర్ చేసిన 500 బిలియన్ డాలర్ల డీల్‌ను కూడా జెలెన్‌స్కీ తిరస్కరించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి. అయితే శని, ఆది వారాల్లో రష్యా ఏకంగా 267 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. అయితే ఇందులో సగానికి పైగా డ్రోన్లను కూల్చేసినట్లుగా ఉక్రెయిన్ ప్రకటించింది. గత వారం వ్యవధిలో రష్యా 1150 డ్రోన్లు, 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులు ప్రయోగించిందని జెలెన్‌స్కీ చెప్పారు.