/rtv/media/media_files/2025/04/05/tcRHLfOUwCQoZsb62CMD.jpg)
NSA Director Timothy Hogg
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రభుత్వం నిర్ణయాలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ఇంత వరకూ అక్రమవలసలు, సుంకాల అంటూ ఇతర దేశాల మీద పడ్డ అధ్యక్షుడు ఇప్పుడు సొంత దేశంపై దాడి ప్రారంభించారు. ఇప్పటికే యూఎస్ ఎయిడ్ మూసేయడం లాంటి చెత్త నిర్ణయాలతో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ట్రంప్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ డైరెక్టర్, ఫోర్ స్టార్ జనరల్ తిమోతీ హగ్ ను సడెన్ గా పదవి నుంచి తొలగించారు. ట్రంప్ ఈ నిర్ణయం అందరినీ షాక్ లో పడేసింది. ఇంత సడెన్ ను ఆయనను ఇంటికి పంపించడానికి కారణం..అధ్యక్షుడిని సపోర్ట్ చేయకపోవడమే అని తెలుస్తోంది. ట్రంప్ ఎజెండాకు, ఆయనకు అనుకూలంగా లేని వారు ఎవరైనా సరే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోవాల్సిందే. సమర్థత కన్నా విధేయతకే ట్రంప్ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెబుతున్నారు. తనను విమర్శిస్తే ఊరుకోరని అంటున్నారు.
వ్యతిరేకించారు..అందుకే తీసేశారు..
జనరల్ తిమోతీ తొలగింపుకు ఎలాంటి కారణం చెప్పలేదు. అయితే ఈయనో పెద్ద ఆఫీసర్. సైబర్, ఇంటెలిజెన్స్ ప్రపంచంలో 33 సంవత్సరాల అనుభవం ఉంది. తిమోతీని తొలగించడం వెనుక లారా లూమర్ లాంటి బయటి, మితవాద కార్యకర్త ప్రభావం ఉందని చెబుతున్నారు. ఇటీవల ట్రంప్‌ను కలిసి, NSA మరియు NSSలోని "విశ్వాసం లేని" అధికారులను తొలగించాలని డిమాండ్ చేశారు. అమెరికా జాతీయ భద్రత వంటి సున్నితమైన సంస్థలలో నిర్ణయాలు రాజకీయ విధేయత ఆధారంగా తీసుకోవడం చాలా ఆందోళనకరమని అంటున్నారు. ఇక తిమోతీతో పాటూ ఆయన డిప్యూటీ వెండి నోబుల్‌ను కూడా పదవి నుండి తొలగించారు.
హగ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ప్రచారానికి వ్యతిరేకంగానే కాకుండా అడ్డంకిగా కూడా మారారు. అందుకే అతనిని పదవి నుంచి తప్పించారని తెలుస్తోంది. దాంతో పాటూ యెమెన్ లో హౌతీ దాడులకు సంబంధించిన సున్నితమైన సమాచారం సిగ్నల్ యాప్ లో లీక్ అయింది. దీనిలో జనరల్ హాగ్ కు ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినప్పటికీ, ఈ సంఘటన NSA మరియు NSS లలో విశ్వాస సంక్షోభాన్ని సృష్టించింది. మొత్తానికి తిమోతీ హగ్ తొలగింపు..ట్రంప్ చేస్తున్న పెద్ద రాజకీయ ప్రక్షాళన ప్రక్రియలో భాగమని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తనకు పూర్తిగా విధేయులైన వారిని మాత్రమే పరిపాలనలో ఉంచాలని ఆయన అనుకుంటున్నారంటున్నారు.
today-latest-news-in-telugu | america president donald trump
Also Read: USA: వాటిపై కూడా సుంకాలు.. ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన!