/rtv/media/media_files/2026/04/14/trump-2026-04-14-06-47-15.jpg)
US military blocks all Iranian ports as Trump’s Hormuz threat takes effect
అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తానని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ పోర్టుల వైపు వెళ్లి, వచ్చే నౌకలను అమెరికా నావీ అడ్డుకుంటోంది. భారత కాలమాన ప్రకారం చూసుకుంటే సోమవారం రాత్రి 7.30 గంటల నుంచి ఈ దిగ్బంధనం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే అమెరికా నౌకాదళం ఇప్పటికే బలగాలను మోహరించేసింది. ఇక ఇరానేతర పోర్టులకు వెళ్లి వచ్చే నౌకలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు కలిగించమని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
Also Read: ఇటు వైపు వస్తే నాశనమే .. ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్
మరోవైపు ఇరాన్‌కు చెందిన 158 నౌకలను పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ దగ్గర ఉన్న ఫాస్ట్ అటాక్ షిప్స్‌ను టార్గెట్ చేసుకోలేదని వాటిని ముప్పుగా భావించడం లేదని తెలిపారు. ఆ నౌకలు ఒకవేళ అమెరికా విధించిన దిగ్బంధనం వైపు వస్తే నాశనం చేస్తామంటూ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు. ఇప్పటికే సముద్రం మార్గం ద్వారా అమెరికాలోకి వస్తున్న డ్రగ్స్‌ను 98.2 శాతం వరకు కట్టడి చేశామన్నారు. డ్రగ్ డీలర్లపై తాము ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటామో.. ఇరాన్ నౌకల విషయంలో కూడా అదే రూల్‌ను పాటిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: హార్ముజ్ జలసంధిపై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త ప్లాన్.. ట్రంప్‌కు ఎదురుదెబ్బేనా?
Follow Us