/rtv/media/media_files/2025/03/16/sh8v1JO7OLsn7eRkQiFm.jpg)
yemen us attack Photograph: (yemen us attack)
యెమెన్‌లోని హౌతీలను టార్గెట్‌గా చేసి అమెరికా శనివారం రెండు చోట్ల వైమానిక దాడులు చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో 19 మంది చనిపోయారు. ఆ దేశ రాజధాని సనాలో జరిగిన వైమానిక దాడిలో 13 మంది పౌరులు మరణించారు. సాదాలో నలుగురు పిల్లలు, ఒక మహిళ సహా ఆరుగురు మృతి చెందారు. అమెరికా వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న హౌతీలను అణిచివేయడానికి ఈ అటాక్ చేశారు. గతకొద్దిరోజుల క్రితమే హౌతీలకు మద్దతు ఇవ్వడం మానేయాలని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఎర్ర సముద్రంలో షిప్పింగ్‌పై యెమెన్‌లోని ఇరాన్- మద్దతుదారులు హౌతీలు చేసిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పెద్ద ఎత్తున సైనిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 19 మంది మరణించారు. ఇక వారు అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే నరకాన్ని వర్షంలా కురిపిస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
Do the Yemeni Houthis understand the seriousness of their situation and Trump's determination?
— Syriac Analysis (@Assyrian2) March 16, 2025
Footage of massive US-airstrikes on Yemen - Attacks on targets in the provinces of Saada, Al-Bayda and Dhamar.#Yemen #USA pic.twitter.com/8nI1KnVOYF
హౌతీలకు ప్రధాన మద్దతుదారుడైన ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. ఆ బృందానికి మద్దతును వెంటనే నిలిపివేయాలని ఆయన అన్నారు. ఇరాన్ అమెరికాను బెదిరిస్తే, అమెరికా మిమ్మల్ని పూర్తిగా జవాబుదారీగా ఉంచుతుంది. ఈ విషయంలో వదిలిపెట్టేది ఉండదని ట్రంప్ అన్నారు. జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో అమెరికా చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదేనని ఒక అధికారి తెలిపారు. యెమెన్ రాజధాని సనాపై అమెరికా జరిపిన దాడుల్లో కనీసం 13 మంది పౌరులు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారని హౌతీల ఆధీనంలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉత్తర ప్రావిన్స్ సాదాపై జరిపిన దాడిలో నలుగురు పిల్లలు, ఒక మహిళ సహా ఆరుగురు మరణించగా, 11 మంది గాయపడ్డారని సమాచారం. మొత్తం 19 మంది అమెరికా దాడుల్లో మరణించారు.