/rtv/media/media_files/NWoBkDnpNNMVW4jcDhXQ.jpg)
అమెరికా (America) అధ్యక్షుడికి ట్రాన్స్ జెండర్లు అంటే మొదటి నుంచీ ఎందుకో ఇష్టం లేదు. ఎన్నికల దగ్గర నుంచి వారి మీద నిషేధం ఉంటుందని చెబుతూనే ఉన్నారు. తాను అధికారంలోకి రాగానే మొట్టమొదటగా క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు ఉండకుండా చట్టాన్ని తీసుకువస్తానని చెప్పారు అన్నట్టుగానే ఆ ఫైల్ మీద మొదటి రోజునే సంతకం చేశారు. దీంతో అమెరికా క్రీడల్లో ట్రాన్స్ జెండర్లను నిషేధించారు. ఇప్పుడు తాజాగా అమెరికా మిలటరీ(US Military)లో కూడా ట్రాన్స్ జెండర్ల నియామకాలను నిషేధించినట్టు సైన్యం ప్రకటించింది.
Also Read : Human Trafficking: సినిమా అవకాశాల పేరుతో గాలం...వ్యభిచార రొంపిలోకి దింపి...
నిషేధాన్ని నిలిపేసిన ఫెడరల్ కోర్ట్...
అయితే ట్రంప్ విధించిన ట్రాన్ జెండర్ల నిషేధాన్ని నిలిపేయాలని అమెరికా కోర్ట్ ఆదేశించింది. మనుషులందరూ సమానత్వమేనని..అందరికీ సమాన హక్కులుంటాయని...ఇందుకు ట్రాన్స్ జెండర్లు అతీతులు కారని కోర్టు చెప్పింది.రాజ్యాంగంలోని ట్రాన్స్‌జెండర్‌ల హక్కులను అధ్యక్షుడు అడ్డుకోకూడదు, ఆ అధికారం ఆయనకు ఉన్నా.. అది సమంజసం కాదని న్యాయమూర్తి అనారేస్ తెలిపారు. దీంతో అమెరికా మిలటరీలో ట్రాన్స్ జెండర్లు కొనసాగేందుకు, కొత్త నియామకాలకు అవకాశం ఏర్పడినట్టుయింది. మరోవైపు క్రీడల్లో కూడా ట్రాన్స్ జెండర్లు పాల్గొనకూడదంటూ ట్రంప్ ఆర్డర్లు పాస్ చేశారు. ఈయనకు రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా వత్తాసు పలుకుతున్నారు. గత ఒలింపిక్స్ లో అల్జీరియాకు చెందిన ఇమానె ఖలీఫ్ ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.
Also Read : ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..!
ఇంతకు ముందు యూఎస్ ఎయిడ్ విషయంలో కూడా ట్రంప్ ప్రభుత్వాన్ని కోర్టు నుంచి చుక్కెదురైయ్యింది. యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల తొలగింపుపై ఫెడరల్ కోర్టులో పిటిషన్లు దాఖలవ్వగా..దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. యూఎస్ ఎయిడ్ మూసివేతను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
Also Read: Mega Star: మీరొక అద్భుతం..మీ ప్రయాణం ఓ అడ్వెంచర్..చిరంజీవి
Also Read : భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!