బ్రిటన్‌ను అడుక్కుంటున్న ట్రంప్.. పాపం అగ్రరాజ్యానికి ఏం గతి పట్టిందంటే?

ఇరాన్‌తో జరిగిన ఘర్షణల్లో అమెరికా తన అమ్ములపొదిలోని డ్రోన్లను భారీగా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అమెరికా బ్రిటన్ దేశం నుంచి డ్రోన్లలను కొనుగోలు చేస్తోంది. రూ. 5 లక్షల కోట్లతో 3 లక్షల డ్రోన్లను తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

New Update
FotoJet (11)

సాధారణంగా ప్రపంచ దేశాలకు అత్యాధునిక రక్షణ పరికరాలను, డ్రోన్లను సరఫరా చేసే అమెరికా.. ఇప్పుడు బ్రిటన్‌ను అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరాన్‌తో జరిగిన ఘర్షణల్లో అమెరికా తన అమ్ములపొదిలోని డ్రోన్లను భారీగా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అమెరికా బ్రిటన్ దేశం నుంచి డ్రోన్లలను కొనుగోలు చేస్తోంది. రూ. 5 లక్షల కోట్లతో 3 లక్షల డ్రోన్లను తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ భారీ ప్రణాళికకు అమెరికా ప్రభుత్వం 'డ్రోన్ డామినెన్స్' అని పేరు పెట్టింది. ఇందుకోసం పెంటగాన్ స్వయంగా రంగంలోకి దిగి అత్యుత్తమ డ్రోన్లను తయారు చేసే కంపెనీలను ఎంపిక చేస్తోంది. ఈ పోటీలో అమెరికాలోని స్టార్టప్‌లతో పాటు బ్రిటన్‌కు చెందిన కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియాకు చెందిన 'నీరోస్', బ్రిటన్‌కు చెందిన 'స్కైకట్టర్స్' వంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.

ఇది కూడా చూడండి: భక్తి ముసుగులో IIT కామాంధుడు....ప్రవచనాలు చెబుతూ  అమ్మాయిలతో రాసలీలాలు!

ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏమిటంటే?

 ఇవి చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి. ఒక్కో డ్రోన్ తయారీకి సుమారు 5,000 డాలర్లు మాత్రమే ఖర్చవుతోంది. యుద్ధ రంగంలో ఇలాంటి డ్రోన్లను శత్రువుల దాడిలో కోల్పోయినా అమెరికాకు పెద్దగా ఆర్థిక నష్టం ఉండదు. అంటే కోట్లాది రూపాయల విలువైన భారీ యుద్ధ విమానాలను పోగొట్టుకునే కంటే.. తక్కువ ఖరీదైన వేల సంఖ్యలో డ్రోన్లతో శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయాలని అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. సైనిక సిబ్బంది ఈ డ్రోన్లను యుద్ధ రంగ పరిస్థితులకు అనుగుణంగా నిరంతరం పరీక్షిస్తున్నారు. ఇటీవల జరిగిన తొలి రౌండ్ పోటీలో బ్రిటన్‌కు చెందిన 'స్కైకట్టర్స్' కంపెనీ విజేతగా నిలిచింది. దీంతో ఆ కంపెనీకి ఇప్పటికే 2,500 డ్రోన్లను తయారు చేసే ఆర్డర్ కూడా లభించింది.

రాబోయే ఏడాది రక్షణ బడ్జెట్ నుంచి సుమారు 54.6 బిలియన్ డాలర్లను ఈ డ్రోన్ల తయారీ కోసం ఖర్చు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. యుద్ధ రంగంలో డ్రోన్ల ఆధిపత్యం పెరిగితే, యుద్ధం చేసే తీరు పూర్తిగా మారిపోతుందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ పెట్టుబడులు రాబోయే కాలంలో అమెరికాను డ్రోన్ టెక్నాలజీలో తిరుగులేని శక్తిగా  మారనుందని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు